స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా కనిపించడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.గత కొన్ని నెలలుగా సమంత అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారని వార్తలు ప్రచారంలోకి రాగా సమంత మేనేజర్ ఆ వార్తల గురించి ఖండిస్తూ వచ్చారు.
అయితే సమంత స్వయంగా తాను ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ సమస్యతో బాధ పడుతున్నానని చెప్పుకొచ్చారు.గత కొన్ని నెలల నుంచి మయోసిటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.
సమంతకు వచ్చిన ఈ వ్యాధి అరుదైన వ్యాధులలో ఒకటి కాగా ఎవరైతే ఈ వ్యాధితో బాధ పడుతూ ఉంటారో వాళ్లలో కండరాలు వాపుకు గురి కావడం జరుగుతుంది.సరైన సమయానికి చికిత్స అందని పక్షంలో అంగవైకల్యం సంభవించే అవకాశం ఉంది.
ఈ వ్యాధి బారిన పడి కొంతమంది మరణించిన సందర్భాలు సైతం ఉన్నాయి.ఈ వ్యాధి బారిన పడిన వాళ్లకు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది.
గాయాలు, ఇన్ఫెక్షన్ల వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు శ్వాస సంబంధింత సమస్యలను సైతం ఎదుర్కొంటారు.ఈ వ్యాధితో బాధ పడేవాళ్లు కొంతదూరం నడిచినా అలసట వస్తుంది.

ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా ఇబ్బంది పడతారు.కూర్చున్న చోటు నుండి లేవాలన్నా కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో ఒక్కొక్కరిలో ఒక్కో తరహా లక్షణాలు కనిపిస్తాయి.
హీట్ థెరపీ, ఫిజికల్ థెరపీ ద్వారా ఈ సమస్యకు దూరం కావచ్చు.సమంత ఈ ఆరోగ్య సమస్య నుంచి త్వరగా కోలుకోవాలని సమంత అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
సమంత ఆరోగ్య సమస్యల వల్ల ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్ లు ఆలస్యమవుతున్నాయి.