తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 రేటింగ్ విషయంలో మొదటి ఎపిసోడ్ రికార్డు సాధించింది.ఆ తర్వాత రెండు వీక్ డేస్ మరియు వీకెండ్స్ కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుంది.
ఆ తర్వాత రెండు వారాలు మాత్రం రేటింగ్ విషయంలో స్టార్ మా వారు పెదవి విరిచే విధంగా వచ్చిందని అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ ను నార్మల్ వారిని పంపించడం వల్ల అబ్బే వీళ్లేం కంటెస్టెంట్స్ రా బాబు అంటూ కొందరు జుట్టు పీక్కుంటూ ఉంటే మరి కొందరు మాత్రం వీరు కంటెస్టెంట్స్ అయితే రేటింగ్ వచ్చినట్లే అనుకున్నారు.
మొదటి రెండు వారాలు మంచి రేటింగ్ వచ్చినా కూడా తర్వాత వారం నుండి వారు అనుకున్నట్లుగానే రేటింగ్ దారుణంగా పడిపోయింది.పైగా బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ అసలు ఉందా అన్నట్లుగా షో యొక్క టాస్క్ లు మరియు ఫార్మట్ కొనసాగుతోంది.
గత సీజన్ లు రేపు ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియకుండా ఉండేవి.ఊహించడానికి కూడా కష్టంగా ఉండేది.కాని ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ సీజన్ 5 లో ఏం జరుగుతుందో ముందే సామాన్య ప్రేక్షకుడు కూడా చెప్పగలుగుతున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న బిగ్ బాస్ సీజన్ 5 కు రేటింగ్ విషయంలో తీవ్ర నిరాశ కలుగుతున్న నేపథ్యంలో క్రియేటివ్ టీమ్ ఇప్పటికి అయినా కాస్త జాగ్రత్త తీసుకుని మళ్లీ రేటింగ్ ను పెంచేందుకు ప్రయత్నించాలి అంటూ స్టార్ మా యాజమాన్యం ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

అందుకే చాలా మంది మాస్క్ వేసుకుని సేఫ్ గా ఆడుతుంటే కొందరు మాత్రం తమకు సంబంధం లేదు అన్నట్లుగా ఆడుతున్నారు.వారందరిని రెచ్చ గొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.టాస్క్ లో భాగంగా కొట్టుకునే వరకు వెళ్లాలి.అప్పుడే మజా వస్తుంది.గ్రూప్ లు లవ్ లు అన్ని ఉంటేనే షో ఆకట్టుకుంటుంది.కనుక అవన్ని వచ్చే వారం నుండి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.