తేజ సజ్జా 'అద్భుతం' ట్రైలర్.. ఇంట్రెస్టింగ్..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆడియెన్స్ కు సుపరిచితుడైన తేజ సజ్జా ఈమధ్యనే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.ఓ బేబీ, జాంబి రెడ్డి, ఇష్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ అద్భుతం.

 Teja Sajja Adbhutam Trailer Released , Adbhutam Movie , Adbhutam Trailer , Disne-TeluguStop.com

మల్లిక్ రామ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మోగుల్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు.తేజా సజ్జ సరసన రాజశేఖర్ తనయురాలు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించారు.

సినిమాను డిస్నీ + హాట్ స్టార్ లో ఈ నెల 19న రిలీజ్ ప్లాన్ చేశారు.ఈ సందర్భంగా సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఒకే నెంబర్ తో ఇద్దరు వ్యక్తులు అది కూడా హీరో హీరోయిన్ మాట్లాడుతుండటం.విషయం తెలిసి షాక్ అవడం జరుగుతుంది.కాన్సెప్ట్ కొత్తగా ఉంది.సినిమా కథకు తగినట్టుగానే టైటిల్ అద్భుతం అని పెట్టారు.

మరి ఆడియెన్స్ చేత కూడా అద్భుతం అనిపిస్తారో లేదో చూడాలి.ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో హను మ్యాన్ సినిమా చేస్తున్నాడు తేజ సజ్జా.ఈ సినిమాలో అతను సూపర్ హీరో గా కనిపించనున్నాడు. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా హను మ్యాన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube