యాసిడ్ బాధితురాలి గెటప్ లో షాపింగ్ మాల్ లో దీపికా... వింత అనుభవం

సొసైటీలో జనం ఎప్పుడు సెలబ్రిటీలు కనిపిస్తే వచ్చి మీద పడిపోయి సేల్ఫీలు అంటూ వారికి చిరాకు తెప్పిస్తూ ఉంటారు.అయిన కూడా వారు నవ్వుతూనే అందరికి ఫ్జోతోలకి ఫోజులు ఇస్తారు.

 Team Chhapaak Steps Out For Promotions In The Capital-TeluguStop.com

అయితే సెలబ్రిటీలు, మామూలుగా ఉండే వ్యక్తుల విషయంలో ప్రజలు మామూలుగానే ఉన్న బిక్షాటన చేసేవాళ్ళు, పిచ్చోళ్ళు, అలాగే వికలాంగుల విషయంలో మాత్రం కాస్తా తేడాగ ప్రవర్తిస్తూ ఉంటారు.కొంత మంది అలంటి వారిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు.

వారిని అంటరాని వాళ్ళుగా చూస్తారు.ఇప్పటికి ఇలాంటి పరిస్థితి సొసైటీలో ఉంది అని చెప్పాలి.

ఇదిలా ఉంటె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె ప్రస్తుతం యాసిడ్ దాడి బాధితురాలిగా ఛపాక్ అనే సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా రిలీజ్ కి అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్ మొదలెట్టింది.

యాసిడ్ దాడి బాధితురాలి గెటప్ లో కొంత మంది నిజంగా యాసిడ్ దాడికి గురైన వారితో దీపికా షాపింగ్ మాల్ కి వెళ్ళింది.యాసిడ్ బాధితుల పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

వీరిని చూసి కొందరు చిరాకుతో అసహించుకున్నారు.కొందరు విసుగుగా ప్రవర్తించారు.

కొంత మంది మాత్రం స్నేహపూర్వకంగా పలకరించారు.ఇక ఈ వ్యవహారాన్ని సీసీ కెమేరాలతో షాపింగ్ మాల్ లో ఉన్న వారి హావభావాలు షూట్ చేశారు.

యాసిడ్ బాధితుల పట్ల సమాజం ప్రవర్తించే తీరు ఇలా ఉంది అంటూ దానికి సంబందించిన వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube