నానిని భయపెట్టేస్తున్న టీడీపీ ? భయపడతాడా ?

ఏపీ సీఎం జగన్ సైతం టీడీపీ విషయంలో కానీ, చంద్రబాబు, లోకేష్ విషయంలో కానీ, ఎప్పుడు హుందాగానే విమర్శలు చేస్తూ ఉంటారు.కేవలం తన పైన, తమ ప్రభుత్వం పైన టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పుడు మాత్రమే జగన్ స్పందిస్తుంటారు.

 Tdp Leaders Complaint Against Kodali Nani, Ycp Kodali Nani, Tdp Leaders, Chandr-TeluguStop.com

అలాగే అసెంబ్లీలోనూ తన స్వరం గట్టిగా వినిపిస్తూ ఉంటారు.అయితే అంత బ్యాలెన్స్ గానే జగన్ విమర్శలు చేస్తూ ఉంటారు.

అది కూడా అత్యవసరం అయితేనే స్పందిస్తూ ఉంటారు.కానీ ఏపీ మంత్రి కొడాలి నాని విషయానికి వస్తే, టీడీపీ ని చెడుగుడు ఆడుకోవడం లో ఆయనకు మించిన దిట్ట మరొకరు లేరు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.

సందర్భం ఉన్నా, లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు.ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుకు కానీ, లోకేష్ కానీ, ఆ పార్టీ నాయకులు ఎవరికైనా జగన్ తో  ఇబ్బంది లేదు.

కానీ నాని వ్యాఖ్యలతో మాత్రం తీవ్రమైన వేదనకు గురి అవుతూ ఉంటారు.ఆయన తిట్టే తిట్లతో రాష్ట్రవ్యాప్తంగా తమ పరువు బజారున పడుతుందనే అభిప్రాయంతో ఉంటూ ఉంటారు.

అలాగే మరో మాజీ మంత్రి దేవినేని ఉమ పైన నాని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటారు.అయితే ఈ మధ్య కాలంలో చేస్తున్న విమర్శలు శృతిమించడంతో టీడీపీ ఆయన విషయంలో ఉపేక్షించే కూడదు అని, చట్ట ప్రకారం ఆయన తిట్ల దండకాన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

దీనిలో భాగంగానే నాని ఉపయోగిస్తున్న భాష శృతి మించుతోంది అని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు విజయవాడ సి పి బత్తిన శ్రీనివాసులు కు ఫిర్యాదు చేశారు.

Telugu Chandra Babu, Complaint, Senior, Tdp, Tdpcomplaint, Ycp Kodali Nani-Polit

కొడాలి నాని మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష అప్రజాస్వామికమని>, నాని భాషను చూసి ఆయన కుటుంబ సభ్యులు కూడా తల దించుకుంటున్నారు అని వర్ల రామయ్య వంటి నాయకులు విమర్శించారు.నాని పై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే, ఈ విషయాన్ని వదిలిపెట్టమని, గవర్నర్ కు సైతం కలిసి ఆయనపై ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.అయితే టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా, ఫిర్యాదు చేసినా, వాటిని పట్టించుకొనట్టుగానే నాని వ్యవహరిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కాకపోతే కొంత కాలం మాత్రం సైలెంట్ అవుతారు.కానీ టీడీపీని, ఆ పార్టీ నాయకులను విమర్శించడం కానీ నాని అపే ఛాన్స్ లేదు.దీనికి కారణం నానికి అన్ని విషయాల్లోనూ జగన్ పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం ఒక కారణం కావొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube