ఏపీలో నగర పాలక, మున్సిపాల్టీ, నగర పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.మొత్తం 75 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి.
వీటిల్లో గెలుపు ఓటములపై ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఎవరికి వారు తామే మెజార్టీ పంచాయతీలు, కార్పొరేషన్లలో గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నాయి.అధికార వైసీపీ అయితే తాము 69 – 72 మున్సిపాల్టీల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉంది.
వైసీపీ అంతర్గత సర్వేల్లోనే టీడీపీ 3 – 5 మున్సిపాల్టీలకు మించి విజయం సాధించిదని .జనసేన + బీజేపీకి 0 మున్సిపాల్టీలు మాత్రమే వస్తాయని అంటున్నారు.
ఇక టీడీపీ అంతర్గత సర్వేల్లో మాత్రం ఆ పార్టీ రెండు కార్పొరేషన్ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని.మరో రెండు కార్పొరేషన్లలో గట్టి పోటీ ఇచ్చామని.అక్కడ కూడా తమకే ఎడ్జ్ ఉందని చెపుతోంది.ఇక టీడీపీ ఓ 20 మున్సిపాల్టీలపై మాత్రం గట్టి నమ్మకంతో ఉంది.
ఈ లిస్టులో టీడీపీ కంచుకోటలు చాలానే ఉన్నాయి.వీటిల్లో ఇచ్ఛాపురం, తాడిపత్రి, హిందూపురం, చిలకలూరిపేట, పిఠాపురం, పెద్దాపురం, మండపేట, ఉయ్యూరు, అద్దంకి, నరసాపురం, నర్సీపట్నం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, బొబ్బిలి, మండపేట, తిరువూరు మున్సిపాల్టీలు ఉన్నాయి.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ఈ మున్సిపాల్టీల్లో విజయం సాధించినా మంచి ఫలితాలు సాధించినట్టే అవుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఇక కార్పొరేషన్లలో విజయవాడ, వైజాగ్, గుంటూరు, ఏలూరు, విజయనగరం లాంటి చోట్ల టీడీపీ అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఫైట్ ఇచ్చింది.మరి టీడీపీ ఆశలు, అంచనాలు ఎంత వరకు ఫలిస్తాయో ? తెలియాలంటే ఈ నెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే.