అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ రాజకీయ పరిణామాలు మారుస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కష్టానికి ప్రతిఫలం దక్కే అవకాశం కనిపించడంలేదు.చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా అవన్నీ జగన్ కి అనుకూలంగానే మారబోతున్నాయని తెలియడంతో బాబు ఆందోళన చెందుతున్నాడు.
తాజాగా కాంగ్రెస్ లోకి కిరణ్ కుమార్‌రెడ్డిని తీసుకువచ్చి జగన్ ఓట్లు చీల్చాలని బాబు చూస్తున్నాడు.అలాగే.
పవన్ కళ్యాణ్, బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జెడీఎస్ లక్ష్మీనారాయణ…ఇలా ఎంత ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేస్తే అంతగా ఓట్లు చీలిపోతాయని…ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోతే తాను మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అనే ఆలోచనలో బాబు ఉన్నాడు.
ఈ ఒక్క ఎన్నికల్లో జగన్‌ని ఓడించేస్తే ఇక నారా లోకేష్‌కి కూడా తిరుగే ఉండదు అన్నది చంద్రబాబు అభిప్రాయం.
అయితే తాజాగా.గ్రౌండ్ లెవెల్‌లో చేసిన ఒక స్టడీ రిపోర్ట్ మాత్రం చంద్రబాబుకు షాక్ ఇస్తోంది.
ఆంధ్రప్రదే్శ్లో ఎక్కువ శాతం ఓట్లన్నీ ఎప్పుడో పార్టీల వారీగా విడిపోయాయని….ఇప్పుడు పవన్, జేడీఎస్ లక్ష్మీనారాయణ, బిజెపి.
ఇలా పార్టీలన్నీ కూడా 2014 ఎన్నికల్లో టిడిపికి పడిన ఓట్లనే చీలుస్తాయని ఓ సర్వే తేల్చి చెప్పింది.కాంగ్రెస్ పార్టీ మాత్రం వైకాపా ఓట్లను చీల్చే అవకాశం ఉందని…అయితే 2014 ఎన్నికల నాటికంటే ఇప్పుడు ఇంకా ఆ పార్టీ పరిస్థితి దిగజారిందని తేలిందట.
అసలు కాంగ్రస్ పార్టీని సామాన్య జనాలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్న విషయం అర్థమవుతోంది.

గత ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుకు కారణమైన బీజేపీ , పవన్ కళ్యాణ్ ఓట్లన్నీ కూడా ఇప్పుడు చీలిపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా తోడైతే టీడీపీ ఓటమి ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇవన్నీ జగన్ కి బాగా కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయి సీనియర్ జర్నలిస్టుల బృందం నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవ్వబోతున్నాయి.
మొత్తంగా ఈ ఫలితాలు చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటును బిజెపి, పవన్, జేడీఎస్, కాంగ్రెెస్, కమ్యూనిస్టులు లాంటి వాళ్ళందరూ చీలిస్తే తాను మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్న చంద్రబాబు ఆలోచనకు ఇది గండికొడుతోంది.
చంద్రబాబు, బిజెపి, పవన్ కళ్యాణ్‌లు అందరినీ ఒకే తాను ముక్కల్లా ప్రజలు చూస్తున్నారని, వీరంతా కుమ్మక్కై జగన్‌ని ఒక్కడినే ఎదుర్కోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నారని ప్రజలంతా బలంగా నమ్ముతున్నట్టు ఆ సర్వేలో తేలిందట.
దీంతో బాబులో కంగారు మొదలయ్యింది.ఈ జర్నలిస్టుల సర్వేకు క్రెడిబులిటీ ఎక్కువగా ఉండడం, గతంలోనూ ఈ సర్వే చెప్పినట్లే అనేక ఫలితాలు కూడా రావడం టీడీపీలో ఆందోళన పెంచుతోంది.







