సెలబ్రెటీలు తమ క్రేజ్‌ను ఉపయోగించుకుని నాలుగు చేతుల సంపాదించుకోవడం అలవాటు చేసుకున్నారు.గతంలో హీరోలు అంటే సినిమాల్లో మాత్రమే నటించేవారు.
కాని ప్రస్తుతం హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరించడం మరియు పలు రంగాల్లో వ్యాపారాలు చేయడం చేస్తున్నారు.తమ క్రేజ్‌తో ఆ వ్యాపారాలను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్లడం చేస్తున్నారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంలో అందరికంటే ముందు మహేష్‌బాబు ఉన్నాడు.డజను బ్రాండ్స్‌కు గతంలో అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే.
ఇప్పుడు మహేష్‌బాబు దారిలో పలువురు తెలుగు హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
రామ్ చరణ్ ఈమద్య హ్యాపీ మొబైల్స్ స్టోర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యాడు.
దాదాపు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న రామ్ చరణ్ సదరు కంపెనీ ప్రచారం కోసం యాడ్స్‌లో నటించడంతో పాటు పలు స్టోర్స్ ఓపెనింగ్‌కు కూడా హాజరు అవుతున్నాడు.ఇక కంపెనీ ప్రచారంకు ఫొటో షూట్ కూడా చేస్తున్నారు.
హ్యాపీ మొబైల్స్‌కు చరణ్ పబ్లిసిటీతో మంచి సేల్స్ ఉన్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.ఇప్పుడు హ్యాపీకి పోటీగా సెలక్ట్ మొబైల్ స్టోర్స్ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నెలకొల్పేందుకు సిద్దం అవుతున్నారు.

హ్యాపీకి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ సమయంలో సెలక్ట్ మొబైల్స్ స్టోర్‌కు ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించాలని సంస్థ నిర్వాహకులు భావిస్తున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్‌తో చర్చలు జరపడం, భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో వెంటనే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది.త్వరలోనే సెలక్ట్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు.దాంతో పాటు త్వరలో ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో సెలక్ట్ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ జరుపబోతున్నారు.సెలక్ట్ మొబైల్ స్టోర్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకే రంగంలో ఉన్న రెండు కంపెనీలకు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు ప్రచారం చేస్తున్న కారణంగా వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరు అంటూ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలిగితే ఆ స్టోర్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి.ఇప్పటికే హ్యాపీకి మంచి సేల్స్ ఉన్నాయి.సెలక్ట్ ఎంట్రీతో తగ్గే అవకాశం ఉంది.ఎన్టీఆర్ ప్రచారం వల్ల సెలక్ట్‌కు కలిసి వస్తుందా అనేది చూడాలి.
ఇక మరో వైపు వీరిద్దరు రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నారు.







