ఈ మద్య తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) పేరు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తిరుగుబాటు గళంతో బిఆర్‌ఎస్ నుంచి బహిష్కృతమైన ఈయన కేసిఆర్ ( KCR )పై విమర్శలు చేస్తూ తరచూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని( Khammam ) పది స్థానాలను ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్న నేత కావడంతో పొంగులేటి కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రజెంట్ సైలెంట్ గా ఉన్న పొంగులేటి తదుపరి ఏ పార్టీలో చేరతారు ? బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఖమ్మం జిల్లాలో ఆయన ప్రభావం ఏమేరకు ఉంటుంది.ఖమ్మం జిల్లాలో కేసిఆర్ కు ఒక్కసీటు కూడా దక్కనివ్వను అంటూ పొంగులేటి చేస్తున్న సవాళ్ళ వెనుక ఉన్న దైర్యం ఏంటి ? అనే ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు కారణం అవుతున్నాయి.

పొంగులేటిని పార్టీలో చేర్చుకునేందుకు అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నలే చేస్తున్నాయి.ఆ మద్య కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా పొంగులేటితో భేటీ అయ్యారు కూడా.ఇక తాజాగా బీజేపీ ఆగ్రనేతలు కూడా పొంగులేటితో మంతనాలు జరుపుతున్నారు.
అయితే పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.ఆయన కొత్త పార్టీ పెడతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి.
వాటిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు.అయితే పొంగులేటి కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెగ పోటీపడుతున్నాయి.
మరి నిజంగానే పొంగులేటికి ఖమ్మం జిల్లాలో అంత సీన్ ఉందా ? సమాధానాలు భిన్నంగా వినిపిస్తున్నాయి.

అయినప్పటికి కేసిఆర్ ను ఢీ కొడుతూ ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ కు ఒక్కసీటు కూడా దక్కనివ్వను అంటూ సవాళ్ళు చేస్తున్నారు పొంగులేటి.కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా బలమైన సపోర్ట్ ఉంది.అందువల్ల పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే కాస్త గట్టిబానే ప్రభావం చూపే అవకాశం ఉంది.
కానీ ఆయన బీజేపీ గూటికి చేరితే.అది కేసిఆర్ కే అనుకూలం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు.అందువల్ల పొంగులేటిని పార్టీలో చేర్చుకొని బలపడాలని చూస్తోంది బీజేపీ.
ఇలా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు పొంగులేటికి హైప్ ఇస్తూ.ఖమ్మం జిల్లాలో సత్తా చాటలని చూస్తున్నాయి.
మరి పొంగులేటి అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.







