నేటి సమాజంలో కారణాలు ఏవైనా ఎదురయ్యే కష్టాలను అధిగమించలేక ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.దీనికి కారణం మానసిక స్దైర్యం లేకపోవడం ఒత్తిడిని జయించ లేక పోవడం.
ఇక చిత్రపరిశ్రమలో అయితే ఎందరో నటీనటులు ఇలాగే మరణించిన వారు ఉన్నారు.
కాగా తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి మరో విషాదం చోటుచేసుకుంది.
తమిళ నటుడు, నిర్మాత కుమారజన్(35) నమక్కల్ లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం.
ఇకపోతే తాను సొంతగా నిర్మించి నటించిన చిత్రంసాంతిప్పొమ్ సింతిప్పొమ్ఈ మూవీ నష్టాలను మిగల్చడమే కాదు, ఇండస్ట్రీలో తగినంత గుర్తింపు కూడా తీసుకు రాకపోవడంతో కొంతకాలంగా నిరాశలో ఉన్న కుమారజన్ మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కాగా ఆయన గదిలో మాత్రం ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదట.ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తూ చేస్తున్నారట.