అమెరికా : స్నో బాంబ్ ఎఫెక్ట్ నేల రాలుతున్న మూగజీవాలు...!!

అగ్ర రాజ్యం అమెరికా మంచు గుప్పెట్లో గజ గజ లాడుతున్న విషయం అందరికి తెలిసిందే.స్నో బాంబ్ ఎఫెక్ట్ కారణంగా అక్కడి ఉషోగ్రతలు మైనస్ లలో పడి పోవడంతో పరిస్థితులు ఆందోళన కరంగా మారాయి.

 Snow Bomb Unleashes Blizzard In Us,america, Snow Bomb Effect, New York, Snow, Sn-TeluguStop.com

ఇప్పటికే ప్రాణ ఆస్థి నష్టం జరగడంతో, ఎంతో మంది అనారోగ్యాల పాలవడంతో ప్రజలు ప్రభుత్వం రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తోంది.అమెరికాలో పలు రాష్ట్రాలు సో అలెర్ట్ ప్రకటించాయి ప్రజలు ఎవరూ భయటకు రావద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు దాంతో ప్రజలు హీటర్స్ ఏర్పాటు చేసుకుని ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

స్నో బాంబ్ ఎఫ్ఫెక్ట్ ఎక్కువగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.అయితే

ఫ్లోరిడా లోని ప్రజలు బయటకు రాకుండా చలి గాలుల నుంచీ తప్పించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఇళ్ళలో ఉండే ప్రజలకే రక్తం గడ్డ కట్టుకుపోయే చలిగాలులు వస్తుంటే మరి బయట ఉన్న మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు కుంటేనే భయం వేస్తుంది.ఈ క్రమంలోనే ఫ్లోరిడా ప్రభుత్వం అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

ఫ్లోరిడాలో తరచుగా కనిపించే ఇగ్వానా జాతికి చెందిన బల్లులు కుప్పలు తెప్పలుగా రోడ్లపై పడిపోతున్నాయి.చెట్ల మీద నుంచీ ఒక్కసారిగా కిందకి పడిపోయి కదలలేని స్థితిలో నిర్జీవంగా ఉంటున్నాయి.

అక్కడి చలి గాలుల దాటికి తట్టుకోలేక ఈ బల్లులు బిగుసుకుపోతున్నాయని, కొన్ని చని పోతుండగా మరి కొన్ని బ్రతికి ఉన్నా కదలలేని స్థితిలో ఉంటున్నాయని, ప్రజలు ఎవరూ వాటికి ఎలాంటి హానీ కలిగించవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.వాటి శరీరం ప్రస్తుత ఉష్ణోగ్రతలను తట్టుకోలేక పోతోందని, వాటి శరీర తత్వం అలానే ఉంటుందని, సహజంగా వాటి శరీరంలో రక్తం చల్లగా ఉండటంతో వాటి కదలికలు కూడా మెల్లగానే ఉంటాయని, ప్రస్తుత చలి గాలుల కారణంగా వాటి శరీరంలో రక్తం గడ్డ కట్టుకునిపోయి కదలలేక పడిపోతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.అవి కిందకు పడిపోయినా వాతరణంలో వెచ్చదనం వచ్చిన వెంటనే కోలుకుంటాయని వాటికి హాని తలపెట్టవద్దని సూచనలు చేస్తున్నారు.

Snow Bomb Unleashes Blizzard In US,America, Snow Bomb Effect, New York, Snow, Snow Effect On Animals, Iguana Lizards - Telugu America, Iguana Lizards, York, Snow, Snoweffect

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube