అనాథ పిల్లలకు గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ వేయించిన సితార.. గ్రేట్ అనేలా?

మహేష్ బాబు కూతురు సితార( Sitara Ghattamaneni ) మంచి మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గతంలో ఒక యాడ్ లో నటించిన సితార ఆ యాడ్ ద్వారా సంపాదించిన డబ్బును డొనేట్ చేశారు.

 Sithara Ghattamaneni Shows Guntur Karam For Orphan Kids Details Here,sitara,mah-TeluguStop.com

తాజాగా సితార మరో మంచి పని చేసి తన మంచి మనస్సును చాటుకున్నారు.అనాథ పిల్లలకు గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్( Guntur Kaaram Special Screening ) వేయించి సితార వార్తల్లో నిలిచారు.

చిన్న వయస్సులోనే ఇంత గొప్పగా ఆలోచించే గుణం సితారకే సొంతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్( AMB Cinemas ) లో మహేష్ బాబు ఫౌండేషన్.

చీర్స్ ఫౌండేషన్ తరపున స్పెషల్ షో ఏర్పాటు చేయించారని తెలుస్తోంది.భవిష్యత్తులో సితార మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు సితార గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ సాంగ్( Oh My Baby Song ) కు అద్భుతంగా డ్యాన్స్ వేసి ప్రశంసలు అందుకున్నారు.సితారకు ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Telugu Amb Cinemas, Guntur Kaaram, Mahesh Babu, Baby, Sitara-Movie

సితార ఓ మై బేబీ సాంగ్ వీడియోకు 7 లక్షల 40 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.శ్రీలీల సైతం సితార డ్యాన్స్( Sitara Dance ) గురించి పాజిటివ్ గా స్పందించారు.గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ తో ప్రదర్శితమైనా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది.టికెట్ రేట్లు పెంచడం ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో కలిసివచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

Telugu Amb Cinemas, Guntur Kaaram, Mahesh Babu, Baby, Sitara-Movie

సితార భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ను అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సితార మంచి డ్యాన్సర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సితార చదువుల్లో కూడా టాపర్ అని తెలుస్తోంది.మహేష్ బాబు, సితార కాంబోలో సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube