అనాథ పిల్లలకు గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ వేయించిన సితార.. గ్రేట్ అనేలా?

మహేష్ బాబు కూతురు సితార( Sitara Ghattamaneni ) మంచి మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గతంలో ఒక యాడ్ లో నటించిన సితార ఆ యాడ్ ద్వారా సంపాదించిన డబ్బును డొనేట్ చేశారు.

తాజాగా సితార మరో మంచి పని చేసి తన మంచి మనస్సును చాటుకున్నారు.

అనాథ పిల్లలకు గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్( Guntur Kaaram Special Screening ) వేయించి సితార వార్తల్లో నిలిచారు.

చిన్న వయస్సులోనే ఇంత గొప్పగా ఆలోచించే గుణం సితారకే సొంతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్( AMB Cinemas ) లో మహేష్ బాబు ఫౌండేషన్.

చీర్స్ ఫౌండేషన్ తరపున స్పెషల్ షో ఏర్పాటు చేయించారని తెలుస్తోంది.భవిష్యత్తులో సితార మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు సితార గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ సాంగ్( Oh My Baby Song ) కు అద్భుతంగా డ్యాన్స్ వేసి ప్రశంసలు అందుకున్నారు.

సితారకు ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. """/"/ సితార ఓ మై బేబీ సాంగ్ వీడియోకు 7 లక్షల 40 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

శ్రీలీల సైతం సితార డ్యాన్స్( Sitara Dance ) గురించి పాజిటివ్ గా స్పందించారు.

గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ తో ప్రదర్శితమైనా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది.

టికెట్ రేట్లు పెంచడం ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో కలిసివచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

"""/"/ సితార భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ను అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సితార మంచి డ్యాన్సర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సితార చదువుల్లో కూడా టాపర్ అని తెలుస్తోంది.

మహేష్ బాబు, సితార కాంబోలో సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి