ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేది కురుల సంరక్షణ విషయంలోనే.జుట్టు రాలిపోకుండా ఉండటానికి, ఒత్తుగా మారడానికి రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు.
మన తలపై ఉన్న వెంట్రుకలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి.నెలకు దాదాపుగా అరంగుళం మేర ఈ పెరుగుదల ఉంటుంది.
అంటే ఏడాదికి ఆరంగుళాల మేర ఎదుగుతుంది.అయితే ఆడవారు మాత్రం కాస్త ఎక్కువగా జుట్టుపై శ్రద్ద పెడుతారు.
ఎందుకంటే స్త్రీలకు కురుల అందం చాలా ముఖ్యం.మహిళలు ఎక్కువగా జుట్టును అందంగా కనబడేందుకు స్ట్రెయిటెనింగ్ ప్రక్రియకు చేసుకుంటూ ఉంటారు.
ఈ విధానం వల్ల జుట్టు నిటారుగా ఇష్టం వచ్చినట్టుగా దువ్వుకోవడానికి అవకాశం ఉంటుంది.చాలా మంది కొన్ని కార్యక్రమాలకు వెళ్లడానికి ముఖ్యంగా పెళ్లిళ్లకు, పార్టీలకు వెళ్లడానికి అందంగా తయారవుతుంటారు.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జుట్టును నిటారుగా మలుచుకోవడం ద్వారా అనేక ఇబ్బందులనేవి తలెత్తే అవకాశం ఉంటుంది.స్ట్రెయిటెనింగ్ వల్ల జుట్టుపై దుష్ప్రభావాన్ని చూపుతుంది.
జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.
దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతుంటాయి.
రెగ్యులర్ గా స్ట్రెయిటెనింగ్ కి వెళ్తున్నట్లయితే అధిక వేడి మీ జుట్టుపై పడుతుంది.దీనివల్ల జుట్టులోని సహజ నూనెలు తగ్గిపోతాయి.
జుట్టు ఆరోగ్యంలో ఎంతో కీలకమైన ఈ నూనెలు, కుదుళ్ళ నుండి పోయినపుడు వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభమవుతుంది.వెంట్రుకల చివర్లు విరిగిపోవడానికి ఇదొక ముఖ్య కారణం.
చుండ్రు, దురద మొదలగునవి ఏర్పడడానికి తరచుగా స్ట్రెయిటెనింగ్ చేయడం ఓ కారణంగా ఉంటుంది.అదీగా స్ట్రెయిటెనింగ్ వల్ల జుట్టు నిటారుగా నిలబడుతుంది.
దీనివల్ల కుదుళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది.దానివల్ల జుట్టు పెరుగుదలలో లోపం కనిపిస్తుంది.
అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.రెగ్యూలర్ గా కాకుండా వారానికి కేవలం ఒక్కసారి మాత్రమే స్ట్రెయిటెనింగ్ కి వెళ్ళడం మంచిది.
అంతకు మించి స్ట్రెయిటెనింగ్ వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.తడిజుట్టుతో ఉన్నప్పుడు స్ట్రెయిటెనర్ వాడకపోవడమే మంచిది.
కొబ్బరినూనె, పాలు, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకి పెట్టినట్లైతే అది జుట్టు ఆరోగ్య రక్షణకు చాలా బాగా పనిచేస్తుంది.