ఏపీ రాజకీయాలను కుదిపేసిన్న సంగం డైరీ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర కి హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.సంగం డైరీ ఎండి గోపాలకృష్ణన్ న్యాయస్థానంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కి కోర్టు మంజూరు చేయడం జరిగింది.
అప్పట్లో అరెస్టు చేసిన ప్రారంభంలో ధూళిపాల నరేంద్ర కి కరోనా పాజిటివ్ అని తేలడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.
ఏసీబీ సంగం డైరీ లో అక్రమాలు అవినీతి జరిగినట్లు ఆరోపణలతో ఈ ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ సమయంలో దూళిపాల నరేంద్ర మోడీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జైలు నుండి ఆసుపత్రికి తరలించారు.ఆ తర్వాత కరోనా నుండి కోలుకున్న నేపథ్యంలో ఆసుపత్రి నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోలీస్ అధికారులు తొలగించారు.
అయితే ఈ క్రమంలో కోర్టు పర్మిషన్ లేకుండా ఆసుపత్రి నుండి ధూళిపాల నరేంద్ర ని జైలుకు తరలించడం పట్ల న్యాయస్థానం ఆగ్రహించి ఇద్దరిని తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆసుపత్రిలోనే ఉంచాలని స్పష్టం చేసింది.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయటంతో టీడీపీ కేడర్ లో సంతోషం నెలకొంది.