NTR: తారక్ లావు కావడానికి ఆ అమ్మాయే కారణమా.. మరో మహిళ ఎవరంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలలో నటించగా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తారక్ ప్రయాణం మొదలైంది.వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించకపోయినా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే తారక్ స్టార్ హీరో అవుతారని కామెంట్లు వినిపించాయి.

 Shocking Facts Behind Tarak Look Details, Tarak, Junior Ntr, Jr Ntr Weight, Jr N-TeluguStop.com

స్టూడెంట్ నంబర్1, ఆది, సింహాద్రి సినిమాల విజయాలు తారక్ కెరీర్ కు ప్లస్ అయ్యాయి.

ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగి కెరీర్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అయితే తారక్ కెరీర్ తొలినాళ్లలో బొద్దుగా కనిపించారు.అశోక్, రాఖీ సినిమాలలో తారక్ లుక్ గురించి ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే తారక్ ఆ సమయంలో బొద్దుగా కావడానికి ఇద్దరు కారణమట.ఎన్టీఆర్ తల్లి షాలిని వంటలు అద్భుతంగా చేసేవారు.

ఆ వంటల విషయంలో తారక్ ఎలాంటి నిబంధనలు లేకుండా తినేవారు.

Telugu Ashok, Master Vijay, Jrntr, Jr Ntr, Ntr, Rakhi, Tarak-Movie

ఈ రీజన్ వల్లే తారక్ బరువు పెరిగారు.ఆ తర్వాత తారక్ బరువు పెరగడానికి మరో అమ్మాయి కూడా కారణం కావడం గమనార్హం.ఎన్టీఆర్ సినిమాలలో కొన్ని సినిమాలకు ఫైట్ మాస్టర్ విజయ్ పని చేయగా విజయ్ భార్య వంటలు బాగా చేసేవారు.

విజయ్ తారక్ కలిసి భోజనం చేసే సమయంలో విజయ్ భార్య వండిన వంటకాలను తారక్ కూడా ప్రతిరోజూ తినేవారని సమాచారం.

Telugu Ashok, Master Vijay, Jrntr, Jr Ntr, Ntr, Rakhi, Tarak-Movie

ప్రతిరోజూ ఇంట్లో, సెట్స్ లో టేస్టీ ఫుడ్ తినడం వల్లే తారక్ లుక్ మారింది.అయితే తన లుక్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలోనే తారక్ బరువు తగ్గి ప్రస్తుతం కొత్త లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.తారక్ కొత్త మూవీ షూట్ త్వరలో మొదలుకానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube