మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) ఈమధ్య కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు, కాస్త రొటీన్ కి బిన్నంగా ఉండే సినిమాలు మరియు క్యారెక్టర్స్ చేస్తున్నాడు.‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలతో వరుసగా రెండు సార్లు వంద కోట్ల రూపాయిలను కొల్లగొట్టిన రవితేజ , ఆ తర్వాత ‘రావణాసుర‘ మరియు రీసెంట్ గా ‘టైగర్ నాగేశ్వర రావు’ వంటి సినిమాలు చేసి కమర్షియల్ గా రెండు ఫ్లాప్ సినిమాలను అందుకున్నాడు.అయితే ఈ రెండు సినిమాలకు ఒక సెక్షన్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా ‘టైగర్ నాగేశ్వర రావు( Tiger Nageswara Rao )’ చిత్రానికి డీసెంట్ స్థాయి టాక్ వచ్చింది.
కానీ రెండు ‘దసరా’ కానుకగా విడుదలైన మూడు సినిమాలలో ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం ఆడియన్స్ కి మూడవ ఛాయస్ గా మిగిలింది.అందుకే కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది కానీ రవితేజ కి మాత్రం డిఫరెంట్ గా ట్రై చేసాడు అనే పేరొచ్చింది.
బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 28 కోట్ల రూపాయిలను వసూలు చేసింది ‘టైగర్ నాగేశ్వర రావు’ .ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల రూపాయలకు జరిగింది.అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయిల నష్టాలు వచ్చింది అన్నమాట.ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) లో స్ట్రీమింగ్ చేసారు.
థియేటర్స్ లో అంతంత మాత్రం రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా, ఓటీటీ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో మొదటి 48 గంటల్లో 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట .అంటే దాదాపుగా ఒక స్టార్ హీరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి వచ్చిన రేంజ్ రెస్పాన్స్ అన్నమాట ఇది.ఈ రెస్పాన్స్ ని చూసి మూవీ యూనిట్ చాలా సంతోషపడుతుంది.
అంతే కాదు, సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చాలా బాగుందే, ఈ చిత్రం ఎందుకు ఫ్లాప్ అయ్యింది అంటూ ట్వీట్లు వేస్తున్నారు.సరైన సీజన్ లో ఎలాంటి క్లాష్ లేకుండా ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉంటే కచ్చితంగా పెద్ద హిట్ అయ్యేది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.అయితే రజినీకాంత్ ‘జైలర్’ చిత్రం గత రెండు నెలల నుండి నాన్ స్టాప్ గా టాప్ 10 స్థానాల్లో ట్రెండింగ్ అవుతూనే ఉంది.టైగర్ నాగేశ్వర రావు అలా ఎన్ని రోజులు ట్రెండింగ్ లో ఉంటుందో చూడాలి.