సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు సినిమాలలో నటిస్తూ ఉంటారు.అయితే హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ అనేది మామూలుగా ఉండనే ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోల సరసన యంగ్ హీరోయిన్ లు చిన్న ఏజ్ హీరోయిన్లు కూడా నటిస్తూ ఉంటారు.అయితే ఇలా ఇప్పటికే ఎన్నో కాంబినేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో ఇది కాస్త కష్టతరంగానే మారిందని చెప్పవచ్చు.సీనియర్ హీరోలకు వాళ్లకు తగ్గ హీరోయిన్స్ దొరకడం కష్టంగా మారింది.
అయినప్పటికీ చాలానే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్స్.

కానీ దొరకకపోవడంతో ఉన్న హీరోయిన్స్ లోనే ఎవరో ఒకర్ని వాళ్ళకి మ్యాచ్ చేస్తున్నారు.ఇప్పుడు అలా సీనియర్ హీరోస్( Senior Heroes ) అంతా తమకంటే ఏజ్ లో చాలా చిన్నవాళ్ళతో జత కడుతున్నారు.వెంకటేష్( Venkatesh ) ఏజ్ 63 కాగా అతని అప్కమింగ్ సినిమా సైంధవ్ సినిమా( Saindhav ) కోసం 30 ఏళ్లు చిన్నదైనా శ్రద్ధా శ్రీనాథ్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.67 ఏళ్ళ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సీనియర్ హీరో తన ఏజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్లు లేకపోవడంతో తనకంటే 30ఏళ్లు చిన్న వాళ్లైన హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమాలో తనకంటే 30 ఏళ్ళు చిన్నదైన శృతిహాసన్ తో రొమాన్స్ చేశారు.భోళాశంకర్ సినీమాలో తనకంటే 35 ఏళ్లు చిన్నదైన తమన్న తో ఆడిపాడబోతున్నారు.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం 50 ప్లస్ ఏజ్ లో ఉన్నారు.
ఆయన కూడా తన అప్ కమింగ్ మూవీస్ లో తన కన్నా ఎన్నోఏళ్ళు చిన్నవారైన హీరోయిన్స్ తో రొమాన్స్ కు రెడీ అయిపోయారు.హరిహర వీరమల్లులో తనకన్నా 21 ఏళ్ళు చిన్నదైన నిధి అగర్వాల్( Nidhi Aggarwal ) ఆయనతో రొమాన్స్ చేస్తుండగా, ఉస్తాద్ భగత్ సింగ్ లో తనకన్నా 30 ఏళ్ళు చిన్నదైన శ్రీలీలతో కలసి నటించనున్నాడు.

నందమూరి బాలకృష్ణ( Balakrishna ) నెక్స్ట్ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమాగా తెరకెక్కుతున్న దీంట్లో ఆయన సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.కాజల్ కన్నా బాలయ్య 25 ఏళ్ళు పెద్ద.మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నుపూర్ సనన్ రవితేజ కన్నా 25 ఏళ్ళు చిన్నది.