ఆశ్చర్యపోకండి, మీరు విన్నది నిజమే.ఇవి సినిమాలలో గాని, బయట జరగవు అని అనుకుంటారా? లేదండి ఇది నిజం.కావాలంటే ఈ కధనం పూర్తిగా చదవండి.న్యూజీలాండ్( New Zealand ) దేశానికి చెందిన పడవల తయారీ కంపెనీ ‘డ్రెడ్‌నార్ట్ బోట్స్‘( Dreadnought Boats ) గురించి మీరు ఎక్కడో ఒకచోట వినే వుంటారు కదా.తాజాగా ఈ కంపెనీ పోర్టబుల్ మల్టీయూజ్ పాడ్( portable multiuse pod )ను రూపొందించింది.చూడటానికి ఇది ఏదో విచిత్ర గ్రహాంతర వాహనంలా కనిపిస్తున్నప్పటికీ ఉభయచర వాహనం అని చెబుతున్నారు దానిని తరుచేసిన నిపుణులు.
అవును, నేల మీద, నీటి మీద ప్రయాణించగలిగే ఈ వాహనాన్ని ‘డ్రెడ్‌నార్ట్ బోట్స్’ నిపుణులు సునామీలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది.ఈ వాహనం కిటికీలకు దృఢమైన అద్దాలు, మిగిలిన భాగాలను భారీ నౌకల తయారీకి ఉపయోగించే నాణ్యమైన అల్యూమినియం ఉపయోగించారు.ఎందుకంటే ఈ దృఢత్వం ఎటువంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకోగలదు మరి.వాహనం లోపల విశాలమైన స్థలం, వాహనంలోనే వివిధ పరికరాలను చార్జ్ చేసుకునేందుకు వీలుగా 350 వాట్స్ సామర్థ్యం గల ఇన్వర్టర్ వంటివి ఏర్పాటు అందులో ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక వాహనం పైభాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్స్( Solar panels ) ద్వారా ఇది పూర్తిగా సౌర విద్యుత్తుతోనే ప్రయాణిస్తుంది.దీనికి వేరేగా ఛార్జింగ్ అవసరం లేదు.ఆల్రెడీ ట్రైల్స్ నిర్వహించిన ఈ వాహనాలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.అయితే ఇలాంటి ఇండియా లాంటి కంట్రిలోకి రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చు.దీని ధర 61,243 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.50.40 లక్షలు మాత్రమే.దీని ఫోటోలు చూసిన నెటిజన్లు ఇదేదో ఆదిత్య 369 సినిమాలోని టైం మెషిన్ లాగా ఉందని అంటున్నారు.