రివ్యూ : మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్నాడా?

మహేష్‌ బాబు 25వ చిత్రం మహర్షి ఈమద్యే వచ్చినట్లుగా అనిపిస్తుంది.అప్పుడే 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

 Sarileru Neekevvaru Movie Telugu Review-TeluguStop.com

ఎఫ్‌ 2 చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న అనీల్‌ రావిపూడి ఈ చిత్రంను కేవలం ఆరు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా అంచనాలు పీక్స్‌కు వెళ్తూనే ఉన్నాయి.మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుని మహేష్‌ సరిలేరు నీకెవ్వరు అంటూ అభిమానులతో అనిపించుకుంటున్నాడో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

అజయ్‌(మహేష్‌బాబు) ఆర్మీ అధికారి.ఉగ్రవాదులను చీల్చి చెండాడుతూ దేశ సేవ చేస్తూ ఉంటాడు.అలాంటి అజయ్‌ కొన్ని కారణాల వల్ల కర్నూలులో ఉండే ఒక ఫ్యామిలీ వద్దకు వెళ్తాడు.ఆ ఫ్యామిలీ పెద్ద అయిన విజయశాంతి మరియు ఆమె వ్యాపారాలు సమస్యల్లో ఉంటే ముందు నిలుస్తాడు.ఆమెకు ఒక కొడుకు మాదిరిగా నిలిచి ఆమె శత్రువు ప్రకాష్‌ రాజ్‌ను చిత్తు చేస్తాడు.

ఇంతకు ఆర్మీ అధికారి అయిన అజయ్‌ కర్నూలు ఎందుకు వస్తాడు? విజయశాంతి పాత్రకు ప్రకాష్‌ రాజ్‌ పాత్రకు సంబంధం ఏంటీ? అనే ఆసక్తికర విషయాలను సినిమా చూసి తెలుసుకోండి.

Telugu Mahesh Babu-Movie Reviews

నటీనటుల నటన :

మహేష్‌బాబు మరోసారి తన సత్తా చాటించాడు.దూకుడు సినిమా తరహాలో కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా రైలు సీన్‌లో మహేష్‌బాబు కామెడీ సెన్స్‌తో సీన్స్‌ హైలైట్‌ అయ్యాయి.

యాక్షన్‌ సీన్స్‌ మరియు డాన్స్‌లతో కూడా ఈసారి మహేష్‌బాబు మెప్పించాడు.మొత్తంగా సినిమాను తన భుజాలపై వేసుకుని మోశాడని చెప్పుకోవచ్చు.

విజయశాంతి చాలా మంచి పాత్రలో నటించారు.ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు.

ఆమె రీ ఎంట్రీకి మంచి పాత్ర దక్కింది.రష్మిక ఆకట్టుకుంది.

కాని అక్కడక్కడ ఆమె యాక్టింగ్‌ కాస్త ఓవర్‌ అయ్యిందనే వారు కూడా ఉండవచ్చు.అయితే తన పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది.

మహేష్‌ బాబుకు సరిజోడీగా నిలిచింది.ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

టెక్నికల్‌ :

దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతంపై మొదటి నుండే విమర్శలు వస్తున్నాయి.అంతా అనుకున్నట్లుగానే రెండు పాటలు మినహా సినిమాలో సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ రెండు పాటలు కూడా పర్వాలేదు అన్నట్లుగానే ఉన్నాయి.ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అయినా మంచిగా వాయించి ఉంటాడు అనుకుంటే అది కూడా సో సోగానే ఉంది.

సినిమాటోగ్రఫీ బాగుంది.ఆర్మీ సీన్స్‌ మరియు పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్‌ చక్కగా చూపించడంలో సఫలం అయ్యాడు.

ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.ముఖ్యంగా ట్రైన్‌ ఎపిసోడ్‌ను కాస్త కుదించడంతో పాటు రెండు యాక్షన్‌ సీన్స్‌ నిడివి ఎక్కువ అయ్యింది.

వాటిని కూడా తగ్గించి ఉంటే బాగుండేది.దర్శకుడు అనీల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సి ఉంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాకుండా కథ బలంగా సాగేలా ఆయన రాసుకోవాల్సింది.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

Telugu Mahesh Babu-Movie Reviews

విశ్లేషణ :

మహేష్‌బాబు మూవీ అనగానే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంతా కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు.అందుకే మహేష్‌బాబు ఈ చిత్రంను మొదలు పెట్టినప్పటి నుండి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.దూకుడు తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను మహేష్‌బాబు చేయలేదు.అందుకే ఆ లోటును ఈ చిత్రం తీర్చుతుందని ఫ్యాన్స్‌ అనుకున్నారు.అనుకున్నట్లుగానే మహేష్‌బాబు కామెడీ మరియు తనదైన శైలి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రంతో ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్‌ మరియు విజయశాంతి మరియు మహేష్‌బాబుల మద్య ఉండే ఎమోషనల్‌ సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

మహేష్‌బాబు మరియు రష్మికల జోడీ బాగానే ఉంది కాని వారి మద్య ట్రాక్‌ మాత్రం అంతగా బాగాలేదు.వారి మద్య లవ్‌ ట్రాక్‌ను ఇంకాస్త దృడంగా రాసుకుని ఉంటే బాగుండేది.మొత్తంగా ఫ్యాన్స్‌ను మెప్పించే విధంగా ఉంది, సంక్రాంతికి ఒక మంచి సినిమాగా దీన్ని చూడవచ్చు.

ప్లస్‌ పాయింట్స్‌ :

మహేష్‌ బాబు,
విజయశాంతి,
కామెడీ సీన్స్‌,
ఆర్మీ సీన్స్‌

మైనస్‌ :

ఎడిటింగ్‌,
కథ చాలా రొటీన్‌గా ఉంది.

బోటమ్‌ లైన్‌ :

సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్‌.

రేటింగ్‌ : 3.75/5.0

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube