సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో మహేష్ మరోసారి తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీని అందుకున్నాడు.
ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు జనం ఎగబడ్డారు.
మహేష్ యాక్టింగ్, అనిల్ రావిపూడి టేకింగ్ కలగలిసి ఈ సినిమా సంక్రాంతి బరిలో విజయం సాధించింది.
ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ మహేష్ బాబు కెరీర్‌లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.133.28 కోట్ల వసూళ్లు సాధించింది.ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది.
అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 20 రోజుల్లో సాధించిన వసూళ్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 37.72 కోట్లు
సీడెడ్ – 15.12 కోట్లు
గుంటూరు – 9.61 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.02 కోట్లు
ఈస్ట్ – 10.99 కోట్లు
వెస్ట్ – 7.23 కోట్లు
కృష్ణా – 8.58 కోట్లు
నెల్లూరు – 3.89 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 112.16 కోట్లు
కర్ణాటక – 7.42 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.81 కోట్లు
ఓవర్సీస్ – 11.89 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 133.28 కోట్లు