తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి( jaggareddy, ).పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, సొంత పార్టీ నేతలకు చురకల అంటిస్తూ జగ్గారెడ్డి ఎప్పుడూ వార్తల్లోనే ఉంటూ ఉంటారు.
దీంతో ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్త నేతగా ముద్ర పడిపోయింది. ఏ విషయమైనా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ, జగ్గారెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
ఎక్కడా ఏ విషయం పైన ఆయన స్పందించడం లేదు.దీంతో ఆయన ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారనేది చర్చనీయంశంగా మారింది.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, జగ్గారెడ్డి మౌనంగా ఉండడం కాంగ్రెస్ నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అప్పుడప్పుడు వివిధ అంశాలపై జగ్గారెడ్డి స్పందిస్తున్న, గతంలో మాదిరిగా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు.
ఇటీవల రాహుల్ గాంధీ( Rahul gandhi ) తెలంగాణలో పాదయాత్ర చేపట్టిన సమయంలో జగ్గారెడ్డి హడావిడి కనిపించింది ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.ఇదే విషయంపై ఆయనను ప్రశ్నించగా నేను సైలెంట్ గా ఉండడమే మంచిది అని , నేను మాట్లాడితే నష్టమని, పైగా తనను కోవర్ట్ అంటున్నారని జగ్గారెడ్డి ఫైర్ అవుతున్నారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కెసిఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేని సమయంలోను తాను అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించానని, కేసీఆర్ కు వ్యతిరేకంగా అనేక స్టేట్మెంట్లు ఇచ్చానని, ఆయన తనను పట్టించుకోకుండా, పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవడం మానేసి , పార్టీ మంచి కోసం మాట్లాడే తన వంటి వారి మీద ఈ కోవర్ట్ ముద్ర వేయడం వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని జగ్గారెడ్డి చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా తన విషయాన్ని అంతగా పట్టించుకోవడంలేదని, తాను ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాను అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని జగ్గారెడ్డి సీరియస్ అవుతున్నారు.పిఎసి సమావేశాలు, పార్టీ సభలు సమావేశాల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారనే విషయాన్ని అధినాయకత్వం పట్టించుకోకపోతే ఎలా అని జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ను కలిసి అనేక అంశాలపై చర్చనీయాంశం గా మారింది.
గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ బలహీనంగా ఉందని, ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గల్లో ఇన్చార్జీలను నియమించడం వంటి అనే అంశాలపై చర్చించానని, కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదని తన సన్నిహితుల వద్ద జగ్గారెడ్డి వాపోతున్నారట.తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా, జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలను యాక్టివ్ చేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా ప్రయత్నిస్తుందో చూడాలి.