మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
చరణ్ కు జోడీగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ సంగీత కూడా ఉన్నట్లుగా నిన్న విడుదల అయిన లాహె లాహె పాటతో అర్థం అయ్యింది.
సంగీత ఈ సినిమా లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే విషయమై క్లారిటీ లేదు.కేవలం పాట వరకే ఈమె ఉండి ఉంటుందా అనే విషయం కూడా స్పష్టత లేదు.
కాని తాజాగా ఆమె భర్త సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయాన్ని బట్టి చూస్తుంటే ఆమె సినిమా లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంది.ఆమె పాటలోనే కాకుండా సన్నివేశాల్లో కూడా కనిపించబోతుంది.
సంగీతం మెగాస్టార్ చిరంజీవి తో స్క్రీన్ షేర్ కోసం 24 ఏళ్లుగా ఎదురు చూస్తుంది.ఎట్టకేలకు ఆమెకు ఈ అవకాశం దక్కిందని ఈ సందర్బంగా ఆయన ట్వీట్ చేశాడు.24 ఏళ్ల కల నెరవేరినందుకు ఆమె చాలా సంతోషంగా ఉందని కూడా సంగీత భర్త సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.ఆచార్య వంటి క్రేజీ మూవీలో చిన్న పాత్ర అయినా కూడా ఖచ్చితంగా మంచి గుర్తింపు రావడం ఖాయం.
సరిలేరు నీకెవ్వరు సినిమా లో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలో నటించినా కూడా సంగీతకు అది మహేష్ బాబు మూవీ అవ్వడం వల్ల ఆమెకు మంచి గుర్తింపు దక్కించుకుంది.అందుకే ఈ సినిమా తో ఆమె మళ్లీ టాలీవుడ్ లో బిజీ నటి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సంగీత వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా సందడి చేస్తోంది.అప్పుడప్పుడు ఈటీవీలో ప్రసారం అయ్యే షోల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే.