తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే.. ?

ఏపీ తెలంగాణాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు.ఇందులో తెలంగాణ విషయానికి వస్తే.

 Release Of Mlc Election Schedule In Telugu States Ap, Telangana, Mlc Election,-TeluguStop.com

తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి.ఈ పదవులకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడ జరుగుతుందని వెల్లడిస్తున్నారు.

ఈ నెల 23 వ తేదీన నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది.ఇక నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా అదే నెల 26 వ తేదీని నిర్ణయించారు.

అయితే వచ్చే నెల 14న పోలింగ్, 17న కౌంటింగ్ ఉండనుందని అధికారులు వివరించారు.

ఇదిలా ఉండగా ఏపీ విషయానికి వస్తే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కాగా ఫిబ్రవరి నెల 14వ తేదీన తూగో-పగో, కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక నామినేషన్ల స్వీకరణ ఈ నెల 16న మొదలవనుంది.

చివరి గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉండనుంది.కాగా అధికారులు ఈ నెల 26న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.

వచ్చే నెల 14న పోలింగ్, 17న కౌంటింగ్ తో ఈ ఎన్నికల హడవుడి ముగియనుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube