భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మార్చి 7 నుంచి చివరి టెస్ట్ మ్యాచ్ ధర్మశాల వేదికగా ప్రారంభం అవ్వనుంది.భారత్ 3-1 తేడాతో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది.
అయితే ధర్మశాల వేదికగా భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) ఓ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.ధర్మశాల వేదికగా జరిగే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ అశ్విన్ కు 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
దీంతో రవిచంద్రన్ అశ్విన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల స్టాల్ వార్ట్స్ క్లబ్ లో చేరనున్నాడు.
![Telugu Anil Kumble, India England, Tendulkar, Club, Virat Kohli-Sports News క Telugu Anil Kumble, India England, Tendulkar, Club, Virat Kohli-Sports News క](https://telugustop.com/wp-content/uploads/2024/03/ravichandran-ashwin-to-create-new-record-in-fifth-test-match-against-england-detailss.jpg)
రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఏకంగా 507 వికెట్లు తీశాడు.ధర్మశాల( Dharmashala ) వేదికగా జరిగే మ్యాచ్ ఆడితే 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన 14వ భారతీయుడుగా అశ్విన్ నిలుస్తాడు.అయితే భారత్ తరపున అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ నిలిచాడు.
సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) 200 టెస్ట్ మ్యాచ్లు ఆడి 15921 పరుగులు చేశాడు.భారత తరఫున 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు ఎవరంటే.
సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, సౌరబ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, ఛతేశ్వర్ పుజారా, వీరేంద్ర సెహ్వాగ్.
![Telugu Anil Kumble, India England, Tendulkar, Club, Virat Kohli-Sports News క Telugu Anil Kumble, India England, Tendulkar, Club, Virat Kohli-Sports News క](https://telugustop.com/wp-content/uploads/2024/03/ravichandran-ashwin-to-create-new-record-in-fifth-test-match-against-england-detailsa.jpg)
అనిల్ కుంబ్లే తర్వాత భారత తరఫున 500 టెస్ట్ వికెట్లు తీసిన రెండవ భారతీయుడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.అనిల్ కుంబ్లే( Anil Kumble ) భారత గడ్డపై 63 టెస్ట్ మ్యాచ్లు ఆడి 350 వికెట్లు తీస్తే.రవిచంద్రన్ అశ్విన్ 132 టెస్ట్ మ్యాచ్లు ఆడి 619 వికెట్లు తీశాడు.
స్వదేశంలో ఆడిన 59వ మ్యాచ్ లోనే రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే ను వెనక్కు నెట్టేశాడు.అంతేకాదు ఇంగ్లాండ్ పై 100 టెస్ట్ వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇక ధర్మశాల వేదికగా మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.