ఆరు ఏళ్ల ఎదురు చూపుల తర్వాత రవితేజతో స్వామిరారా ఛాన్స్‌

స్వామిరారా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి మంచి సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ.ఈయన ఆ తర్వాత చేసిన సినిమాలు నిరాశ పర్చాయి.కాని ఆఫర్లు మాత్రం తగ్గలేదు.వరుసగా సినిమాలను చేస్తూనే ఉన్నాడు.ఆమద్య శర్వానంద్ తో రణరంగం సినిమాను చేసిన సుధీర్ వర్మ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకుని ఒక కొరియన్ మూవీ రీమేక్ ను చేశాడు.ఆ సినిమా కు శాకినిడాకిని అంటూ టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది.

 Ravi Teja And Ravanasurudu Movie Waiting Fro Six Years ,ravi Teja , Ravanasurud-TeluguStop.com

షూటింగ్‌ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేశారు.సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దగా అప్డేట్‌ ఏమీ ఇవ్వలేదు.

ఎట్టకేలకు టైటిల్‌ పోస్టర్ ను రివీల్ చేయడం జరిగింది.భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాను సురేష్‌ బాబు నిర్మించిన విషయం తెల్సిందే.

రణరంగం సినిమాకు ముందే దర్శకుడు సుధీర్‌ వర్మ మాస్ రాజా రవితేజతో ఒక సినిమాను చేసేందుకు ప్రయత్నించాడు.ఇద్దరి కాంబోలో సినిమా అదుగో ఇదుగో అన్నారు.కాని రవితేజ ఆ సమయంలో కాస్త డౌన్ లో ఉన్నాడు.ఆ సమయంలో ప్లాప్‌ దర్శకుడితో సినిమా అంటే రిస్క్ అనే ఉద్దేశ్యంతో కాస్త వెనక్కు తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి.

సరే ఆ సినిమా షూటింగ్‌ ఆ తర్వాత అయినా చేద్దామని సుధీర్‌ వర్మ అనుకున్నాడు.కాని రవితేజ కాస్త వెయిట్‌ చేయమని చెప్పాడు.

ఎట్టకేలకు సుధీర్‌ వర్మకు ఛాన్స్ ఇచ్చాడు.రావణాసురుడు అనే టైటిల్ తో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది.

Telugu Ravanasurudu, Ravi Teja, Sudheer Varma, Swamirara, Tollywood-Movie

టైటిల్‌ అనౌన్స్ చేయడంతోనే అంచనాలు భారీగా వ్యక్తం అవుతున్నాయి.అభిషేక్‌ పిక్చర్స్ బ్యానర్‌ లో రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ ను వచ్చే ఏడాదిలో మొదలు పెట్టబోతున్నారు.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.సినిమా డైలాగ్ వర్షన్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ ను రవితేజ కు సుధీర్‌ వర్మ వినిపించబోతున్నాడట.ఆరు ఏళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా రాబోతున్నందుకు అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube