Vijay Deverakonda Rashmika Mandanna : నువ్వు చెప్పు నీ కోసం వారిని తీసుకువస్తా… రష్మిక కు ఆఫర్ ఇచ్చిన విజయ్?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు.ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది.

 Rashmika Vijay Devarakonda Instagram Posts Goes Viral In Social Media-TeluguStop.com

అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న ఈ వార్తలను మాత్రం వీరిద్దరూ ఎప్పుడు ఖండిస్తూనే ఉంటారు కానీ వీరి గురించి వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు.ఇలా వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోయినా సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు రిప్లై ఇస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉంటారు.

తాజాగా విజయ్ రష్మిక సోషల్ మీడియా వేదికగా పెట్టిన ముచ్చట్లకు సంబంధించి ఈ వార్త వైరల్ గా మారింది.

Telugu Ram Miriyala, Rowdy-Movie

రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కేవలం సినిమాలో మాత్రమే కాకుండా బట్టల బిజినెస్ కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.రౌడీ కల్చర్( Rowdy Culture ) అనే బ్రాండ్ తో ఈ వ్యాపారం మొదలుపెట్టారు.అయితే తన వ్యాపారాన్ని విస్తరింప చేయడం కోసం ఈయన సింగర్ రామ్ మిరియాల ( Ram Miriyala ) గతంలో పాడిన అలయ్ బలయ్.

సాంగ్ ని తన రౌడీ కల్చర్ కోసం రౌడీ క్లబ్ డ్రెస్ లలో మరోసారి పాడించి ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా పెట్టడంతో ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పై రష్మిక స్పందించారు.

Telugu Ram Miriyala, Rowdy-Movie

ఇది చాలా బాగుంది.నీకు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి విజయ్.నీ ప్లేలిస్ట్ నేను ఎప్పట్నుంచో అడుగుతున్నాను.ఇప్పుడు ప్రపంచం కూడా నీ ప్లే లిస్ట్ చూడాలనుకుంటుంది.ఈ సాంగ్ వైబ్ చాలా బాగుంది.నేను నా ఫేవరేట్ సింగర్స్ లిస్ట్ ఇవ్వనా, ప్లీజ్.

రామ్ మిరియాల చాలా అద్భుతంగా పాడారు అంటూ ఈమె చెప్పకువచ్చారు.అయితే రష్మిక ఇంస్టాగ్రామ్ స్టోరీని విజయ్ దేవరకొండ షేర్ చేస్తూ నీకు కావాలంటే చెప్పు  టాప్ 3 ఇండియన్ ఆర్టిస్ట్స్, వాళ్ళని స్పెషల్ గా నీ కోసం నేను తీసుకొస్తాను అని పోస్ట్ చేసాడు.

ఈ విధంగా వీరిద్దరూ సోషల్ మీడియా( Social Media )లో ముచ్చట్లు పెట్టడంతో ఇందుకు సంబంధించిన ఈ పోస్టులు కాస్త వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube