'ఉస్తాద్' గ్లిమ్స్ పై చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వెయిట్ చెయ్యలేక పోతున్నానంటూ..

పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్” ( Ustaad Bhagat Singh ) .ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Ram Charan Post On Ustaad Bhagat Singh Glimpse , Ram Charan, Pawan Kalyan, Ustaa-TeluguStop.com

డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలో ఈ కాంబోపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇప్పటికే ఈ కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ వచ్చేసింది.అందుకే ఈ కాంబోలో వస్తున్న రెండవ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయి రెండవ షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నుండి మే 11న గ్లిమ్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఉస్తాద్ గ్లిమ్స్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూడగా ఎట్టకేలకు ఈ గ్లిమ్స్ ను అయితే రిలీజ్ చేసారు.ఈ గ్లిమ్స్ కు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.పవన్ మరోసారి పోలీస్ గెటప్ లో అదరగొట్టాడు.

ఈసారి అంతకు మించి ఉంటుందని టీజర్ తోనే తెలిపారు.మరి ఈ గ్లిమ్స్ పై తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

ఈ మాస్ గ్లిమ్స్ చాలా బాగా నచ్చింది అని.ఈ సినిమాను థియేటర్స్ లో చూడడం కోసం ఎదురు చూడలేక పోతున్నాను అని పోస్ట్ చేస్తూ టీమ్ అందరికి గుడ్ లక్ చెప్పాడు.ఈ పోస్ట్ సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న చరణ్ ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube