మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) తన దర్శక నిర్మాతలతో ఎంతో వినమ్రంగా సన్నిహితంగా మెలుగుతారన్న ప్రశంసలు ఉన్నాయి.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చరణ్ కి ఉంది.
పాన్ ఇండియా స్టార్ డమ్ చిక్కినా సింప్లిసిటీ అతడి నైజం.కానీ చరణ్ తో సినిమా చేసిన ఓ దర్శకుడి ఆరోపణ అందుకు భిన్నంగా ఉంది.
రామ్ చరణ్ నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదని అతడు ఫిర్యాదు ఇచ్చాడు.ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏమా కథ? అంటే
అసలు విషయానికి వస్తే 2013లో ‘జంజీర్'(అమితాబ్) తెలుగు రీమేక్ ని తెరకెక్కించిన అపూర్వ లఖియా చాలా కాలంగా రామ్ చరణ్ కి సన్నిహితుడు.రామ్ చరణ్ నటించిన జంజీర్( Zanjeer ) బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు,ఆ సినిమా ఫలితం నిరాశపరిచినప్పటికీ అది తన స్నేహాన్ని ప్రభావితం చేయలేదని అపూర్వ లఖియా( Director Apoorva Lakhia ) ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించారు.అయితే తన ఫోన్ కాల్ లకు సమాధానం ఇవ్వకపోవడం రామ్ చరణ్ కు అలవాటు అని వ్యాఖ్యానించాడు.
అతడు నాకు మంచి స్నేహితుడు.జంజీర్ బాక్సాఫీస్ వద్ద ఎలా పని చేసినా కానీ నేను హైదరాబాద్ లోని తన ఇంటికి వెళ్లి చాలాసార్లు అతనితో కలిసి ఉన్నాను.
కానీ ఇప్పుడు అతను అలా చేయలేదు.నా ఫోన్ కాల్స్ పికప్ చేయడం లేదు.
నాకు తెలీదు.బహుశా చరణ్ ఫోన్ మారిపోయిందేమో… అతని భార్య ఉపాసన ప్రత్యుత్తరం ఇస్తుంది.
కానీ చరణ్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు అని అపూర్వ లఖియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పాన్ ఇండియా మూవీ RRR చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తో మాట్లాడారా? అన్న ప్రశ్నకు.చరణ్ నాకు ఉక్రెయిన్ నుండి కాల్ చేసి నేను ఏం చేస్తున్నాను? అని అడిగాడు.నేను పెద్దగా ఏమీ చేయడం లేదని చెప్పాను.
నేను రెండు మూడు యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేయాలని అడిగాడు.రెండవ యూనిట్ తో సీక్వెన్స్ లు చేయాలి.
మీరు వచ్చి చేయగలరా? అని అడిగాడు.తప్పకుండా నేను మీ కోసం వస్తాను అని అన్నాను.
తర్వాత మళ్లీ ఫోన్ చేసి ”చేయగలవా?” అని అడిగాడు.

కానీ నేను ఏదో షూటింగ్ చేస్తున్నాను.లేదా ఏదో పనిలో బిజీ గా ఉన్నాను.కాబట్టి నేను వెళ్ళలేకపోయాను.
అదే చివరిసారి.నేను అతనితో మాటలు.
చరణ్ యాధృచ్ఛికంగా నాకు కాల్ చేస్తాడు.కానీ అతను నా కాల్ లకు సమాధానం ఇవ్వడు! అని వ్యాఖ్యానించాడు.
రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.అతని భార్య ఫోన్ లు మ్యానేజ్ చేస్తున్నారని తాను అర్థం చేసుకున్నానని అపూర్వ అన్నారు.
తాను హైదరాబాద్ కు వచ్చినప్పుడు రామ్ తన ను కలుస్తాడని.అయితే చివరిసారిగా నగరాన్ని సందర్శించి చాలా కాలమైందని అతడు తెలిపాడు.

‘లగాన్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి అశుతోష్ గోవారికర్ తో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అపూర్వ లఖియా. షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా- దస్ కహానియన్ – మిషన్ ఇస్తాంబుల్-హసీనా పార్కర్ వంటి చిత్రాల కు దర్శకత్వం వహించాడు.
రామ్ చరణ్ తో ‘జంజీర్’ రీమేక్ ఫెయిల్ కావడం అతడిని తీవ్రంగా నిరాశపరిచింది.అయినా చరణ్ అతడికి తిరిగి మరో అవకాశం ఇచ్చేందు కు ప్రయత్నించారు.కానీ దానిని సద్వినియోగం చేసుకోలేదని పరోక్షంగా అపూర్వ అంగీకరించాడు.ఒదిగి ఉండే తన స్వభావాన్ని ఎప్పటికీ చరణ్ వదులుకోడ ని స్నేహాన్ని మరువడని అపూర్వ లఖియా తన ఇంటర్వ్యూలో పరోక్షంగా కితాబిచ్చాడు…
.