ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్యే కవిత పేరు ప్రస్తావన

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది.అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

 Mla Kavitha's Name Mentioned In Delhi Liquor Case-TeluguStop.com

పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈడీ పలు అభియోగాలు చేసింది.మద్యం పాలసీ ద్వారా కుంభకోణం జరిగిందని ఈడీ తెలిపింది.

సౌత్ గ్రూపులో అరుణ్ పిళ్లై కీలకమైన వ్యక్తి అని, కవిత ప్రతినిధిగా ఆయన వ్యవహరించారని ఆరోపించింది.లిక్కర్ వ్యాపారం డబ్బులతో భూములు కొనుగోలు చేసినట్లు ఈడీ అభియోగాలు మోపింది.

మనీలాండరింగ్ వ్యవహారంలో కవితను విచారించినట్లు ఈడీ కోర్టుకు వివరించింది.ఈడీ వాదనలు విన్న న్యాయస్థానం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని పిళ్లై న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube