జగన్ ఉక్కిరిబిక్కిరి.. అయ్యో ఏంటిది ?

” కక్కలేక.మింగలేక.” అన్నట్లైంది ప్రస్తుతం ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి( AP CM Jaganmohan Reddy ) పరిస్థితి.పాత పాత సమస్యలన్నీ కొత్తగా తెరపైకి వస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

 Problems Surrounding Jagan , Chandrababu Naidu , Ex Minister Ys Viveka Murder C-TeluguStop.com

తానొకటి తాలిస్తే దైవం ఇంకోటి తలుస్తాది అన్నట్లుగా ఈసారి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని ఆశగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.గత ఎన్నికల ముందు తనకు ప్లెస్ అయిన కొన్ని సంఘటనలు ఇప్పుడు తలనొప్పిగా మారాయి.

గత ఎన్నికల ముందు వైఎస్ వివేకా హత్య ( Murder of YS Viveka )ఎంతో కొంత జగన్ కు సానుభూతి ఓట్లను తీసుకొచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్ ( Visakha Airport )లో జరిగిన కోడి కత్తి వ్యవహారాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నారు వైఎస్ జగన్.అప్పుడెప్పుడో జరిగిన ఈ సమస్యలే ఇప్పుడూ జగన్ కు పంటి కింద రాయిలా మారాయి.2019 నుంచి మిస్టరీగానే సాగుతున్న వివేకా హత్య కేసు ఈ మద్యనే ఓ కొలిక్కి వస్తోంది.

Telugu Chandrababu, Ys Viveka, Visakha Airport, Ys Jagan-Politics

ఈ కేసులో ఇటీవల వైఎస్ భాస్కర్ రెడ్డి ( YS Bhaskar Reddy )అరెస్ట్ అయ్యారు.ఇక ప్రధాన నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) ఉన్నారు.ఈయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్ కు తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉంది.ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి అండగా నిలుస్తూ వచ్చారు జగన్.దాంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వైఎస్ వివేకా హత్య వెనుక ఉన్న అదృశ్య వ్యక్తి జగనే అనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంది.

ఈ పరిణామం వచ్చే ఎన్నికల్లో వైసీపీపై గట్టిగానే ప్రభావం చూపిస్తాయి.ఈ సమస్యనే జగన్ కు తలనొప్పి అనుకుంటే.

కోడికత్తి సమస్య జగన్ ను మరింత ఇబ్బంది కి గురీ చేస్తోంది.గత ఎన్నికల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ లో అది కూడా వీఐపీ లాంచ్ లో అందరూ చూస్తుండగానే జగన్ పై కోడికత్తితో దాడి చేశాడు ఓ అనామకుడు.

అప్పట్లో ఆ దాడి చేయించింది టీడీపీ నేతలే అని, జగన్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

Telugu Chandrababu, Ys Viveka, Visakha Airport, Ys Jagan-Politics

కట్ చేస్తే తాజాగా ఈ కేసులోని నిందితుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగన్ మెడకే చుట్టుకునేలా కనిపిస్తున్నాయి.జగన్ అధికారంలోకి రావలనే కోరికతోనే తాను ఈ పని చేసినట్లు నిందితుడు శ్రీనివాస్ చెప్పాడు.ప్రజాల్లో సానుభూతి పెరుగుతుందని అభిమానంతోనే జగన్ పై కోడి కత్తితో దాడి చేసినట్లు స్పష్టం చేశాడు.

దాంతో ఇదంతా జగన్ కు తెలిసే జరిగిందా అనే సందేహాలు రాక మానవు.అధికారం కోసం జగన్ ఇన్ని కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారా అనే భావన ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంది.

ప్రజల్లో ఈ భావనా ఏర్పడితే అది వచ్చే ఎన్నికల్లో జగన్ కు అధికారాన్ని దూరం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ విధంగా గత ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య మరియు కోడికత్తి ఘటన.ఈ ఎన్నికల ముందు జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.మరి వీటినుంచి వైఎస్ జగన్ ఎలా బయట పడతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube