డెలివరీ డేట్ గురించి క్లారిటీ ఇచ్చిన ఉపాసన.. బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ భార్య ఉపాసన( Upasana ) ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే.ఉపాసన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Upasana Comments About Delivery Date Details Here Goes Viral In Soical Media ,-TeluguStop.com

ఉపాసనకు చిరంజీవి ఇంట్లో మళ్లీ శ్రీమంతం జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.ఉపాసన డెలివరీ సమయం దగ్గర పడుతుండటంతో చరణ్ సైతం కొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.

ఉపాసన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డాక్టర్స్ నాకు జులైలో డెలివరీ డేట్ ఇచ్చారని ఆమె అన్నారు. రామ్ చరణ్( Ram charan ) ప్రతి క్షణం నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాడని ఉపాసన కామెంట్లు చేశారు.పుట్టబోయే బిడ్డ కొరకు అందరి మాదిరిగా మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఉపాసన తెలిపారు.ఒకవైపు పుట్టినబిడ్డను చూసుకుంటూ మరోవైపు కెరీర్ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రొఫెషనల్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నానని ఉపాసన వెల్లడించారు.బుధవారం రాత్రి బేబీ షవర్ కార్యక్రమం జరగగా ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారని తెలుస్తోంది.అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.దుబాయ్ లో ఉపాసన సోదరీమణులు కూడా ఉపాసనకు సీమంతం నిర్వహించారు.

ఉపాసన చరణ్ లకు పుట్టబోయే బిడ్డకు సంబంధించి పేరు కూడా ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.చరణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.చిరంజీవి, చరణ్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.చిరంజీవి, చరణ్( Chiranjeevi ) ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ఉపాసనకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube