విశాఖ నగరంలో జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.నగరంలోని వివిధ ప్రాంతాల్లో, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ,షాపింగ్ మాల్ క్రీడా ప్రాంగణాల్లో మరియు నగరంలోని నిర్మానుష ప్రాంతాల్లో ఎక్కువ రోజులుగా పార్కింగ్ చేసి ఉన్న టూ వీలర్స్ ని ఎవరికి అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా ఎవరూ లేని సమయంలో బైక్ దొంగతనాలు చేస్తూ వాటిని అనుమానం రాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్మేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ మద్యం మత్తు పదార్థాలకు అలవాటుపడిన యువకులు కొంతకాలంగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు అలాగే ఒక బైకు పోయింది అనే కంప్లైంట్ ద్వారా సదరు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీస్ యంత్రాంగం ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి యువకులను అరెస్టు చేశారు.
వారి నుండి 13 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు ఇందులో ఇద్దరికి పాత నేర చరిత్ర ఉండడం గమనార్హం
.