ప్రస్తుత కాలంలో బిజినెస్( Business ) పెట్టి సక్సెస్ సాధించాలని భావించే వాళ్లలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు.ఎక్కువ మొత్తం పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టినా ఆ బిజినెస్ తో మంచి లాభాలను అందుకునే విషయంలో చాలామంది తడబడుతున్నారు.
అయితే కేవలం 5 వేలతో మొదలుపెట్టి ప్రస్తుతం భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టిన వాళ్లలో అలఖ్ పాండే ఒకరు.విజయం సాధించాలంటే అజ్ఞానం కూడా ఉండాలని అలఖ్ పాండే చెబుతున్నారు.
నాకు ఏమీ తెలియదని అనుకున్న సమయంలోనే తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుందని అలఖ్ పాండే చెబుతున్నారు.అదే సక్సెస్ కు దారి చూపుతుందని ఆయన అన్నారు.పాఠాలను పాఠాలుగా బోధించడానికి బదులుగా పాఠాలను రియల్ లైఫ్ లోకి తీసుకొచ్చి హాస్యం జోడించి చెబితే పాఠం సులువుగా అర్థమవుతుందని ఆయన సక్సెస్ స్టోరీ ద్వారా అర్థమవుతుంది.జటిలమైన ప్రశ్నలకు సమాధానాలను అర్థమయ్యేలా చెప్పడంతో అలఖ్ పాండే సక్సెస్ అయ్యారు.
అలఖ్ పాండే( Alakh Pandey ) మొదట ఫిజిక్స్ వాలా పేరుతో యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టారు.ప్రస్తుతం అలక్ పాండేకు 61 యూట్యూబ్ ఛానెళ్లు, 31 మిలియన్ల సబ్ స్క్రైబర్లు, 5.3 బిలియన్ వ్యూస్ ఉండటం గమనార్హం.పోటీలో ఎంతమంది ఉన్నా మన స్టైల్ లో మనం కష్టపడితే సక్సెస్ కావడం సాధ్యమేనని అలక్ పాండే ప్రూవ్ చేశారు.
తన సక్సెస్ గురించి అలక్ మాట్లాడుతూ తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని అన్నారు.మాకు ప్రతి రూపాయి 100 రూపాయలతో సమానం అని అలక్ పాండే కామెంట్లు చేశారు.
స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారో తెలుసుకుని లైవ్ క్లాసులలో దానిని అప్లై చేసి సక్సెస్ సాధించారు.సక్సెస్ సాధించాలని బలంగా అనుకుంటే ప్లాన్ బీ గురించి ఆలోచన రాదు, వేగంగా పరాజయం పాలైనా సరే నిదానంగా గట్టి విజయం సాధించాలి అనే సూత్రాలు అలక్ పాండే సక్సెస్ సూత్రాలుగా ఉన్నాయి.