తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న పరిటాల ఫ్యామిలీ ప్రస్తుత పరిస్థితులు ఆ పార్టీకి దూరం దూరంగా జరుగుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.గత టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పరిటాల సునీతకు టీడీపీ ప్రభుత్వం బాగానే ప్రాధాన్యం ఇచ్చింది.
అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పరిటాల సునీత తో పాటు ఆమె కుమారుడు శ్రీరామ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.దీనిని నిజం చేసేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ, నిరసన కార్యక్రమాలకు పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ హాజరుకాకపోవడం, రాప్తాడు లోనూ టిడిపి సందడి పెద్దగా కనిపించకపోవడంతో ఆమె తెలుగుదేశం పార్టీకి దూరంగా జరుగుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిటాల కుటుంబం పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగినా ఆ తరువాత ఆ వ్యవహారం సద్దుమణిగింది.
ప్రస్తుతం పరిటాల ఫ్యామిలీ పార్టీ మార్పు అంశం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.చంద్రబాబు పర్యటనలో పరిటాల సునీత పాల్గొనకపోవడం, అనారోగ్యమే కారణమని టీడీపీ నాయకులు పైకి చెబుతున్నా, ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆమె కుమారుడు కూడా ఈ సమావేశానికి రాకపోవడానికి కారణం పార్టీ మారే ఉద్దేశంతో ఉండడమేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
![Telugu Anantapur, Ap, Paritala, Rayalaseema Tdp, Sri Ram-Political Telugu Anantapur, Ap, Paritala, Rayalaseema Tdp, Sri Ram-Political](https://telugustop.com/wp-content/uploads/2020/01/Paritala-family-Maybe-Join-inBJP.jpg)
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన పరిటాల ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోంది.ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా వారు ఇష్టపడటం లేదు.కానీ ఎవరు పరిటాల సునీత శ్రీరామ్ ఇద్దరు బిజెపి నాయకులతో టచ్లో ఉన్నారని, వారు పార్టీలోకి వెళ్లేందుకు కొన్ని షరతులు విధించారు అనే ప్రచారం జరుగుతోంది.బిజెపి పెద్దలతో ఆ షరతుల గురించి మాట్లాడుతున్నారని, ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని బీజేపీలోకి జంప్ చేస్తారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.
![Telugu Anantapur, Ap, Paritala, Rayalaseema Tdp, Sri Ram-Political Telugu Anantapur, Ap, Paritala, Rayalaseema Tdp, Sri Ram-Political](https://telugustop.com/wp-content/uploads/2020/01/Paritalafamily-Maybe-Join-in-BJP.jpg)
టీడీపీలో పరిటాల ఫ్యామిలీకి బాగానే ప్రాధాన్యం ఉన్నా, ముందు ముందు ఆ పార్టీకి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే పార్టీ మారే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం ఇదే కనుక జరిగితే అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బ తింటుంది.ఇప్పటికే పరిటాల ఫ్యామిలీకి వీరవిధేయుడిగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు.