డైరెక్టర్ శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఈరోజు థియేటర్లో విడుదలైన సినిమా ఒకే ఒక జీవితం.ఇందులో శర్వానంద్, రీతు వర్మ, అక్కినేని అమల, ఆలీ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమా టైం ట్రావెల్ ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో రూపొందింది.ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ ని అందించాడు.ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమాకు నిర్మాతలుగా చేశారు.
ఇక ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందగా మొత్తానికి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మరి ఈ సినిమా కథ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.పైగా శర్వానంద్ కు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
ఇందులో శర్వానంద్ ఆది పాత్రలో, వెన్నెల కిషోర్ శ్రీను అనే పాత్రలో, ప్రియదర్శి చైతు అనే పాత్రలో కనిపించారు.ఇక ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు.
ఇక ఈ ముగ్గురికి కొన్ని సమస్యలు ఉండగా వారి వారి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.ఇక ఆ బాధలను తట్టుకోలేక వారికి జీవితంపై విరక్తి కూడా వస్తుంది.
దీంతో ఆ సమయంలో వారికి సైంటిస్టుగా నాజర్ పరిచయం అవుతాడు.అయితే నాజర్ తను ఒక టైం మిషన్ కనిపెట్టడంతో వాళ్లను అందులోకి పంపిస్తాడు.
దీంతో గతంలోకి వెళ్లిన ఆ ముగ్గురు తమ సమస్యలను పరిష్కరించుకున్నారా లేదా అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
శర్వానంద్ నటన గురించి ఆయన పాత్రకు చేసే న్యాయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ పాత్రలో ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు.తన ఎమోషనల్ తో అందరిని ఏడిపించాడు.
ఇక రీఎంట్రీ ఇచ్చిన అక్కినేని అమల మరోసారి అమ్మ పాత్రకు న్యాయం చేసింది.ఇక మిగతా నటులు వెన్నెల కిషోర్, నాజర్, ప్రియదర్శి, తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా డైరెక్టర్ శ్రీ కార్తీక్ ఈ సినిమాను అద్భుతంగా చూపించాడు.మంచి స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది.
మిగతా టెక్నికల్ విభాగాలు పూర్తిగా పనిచేశాయి.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా సైన్స్ నేపథ్యంలో వచ్చినా కూడా విధి రాతను ఎవరు తప్పించలేరు అన్నట్లుగా చూపించాడు దర్శకుడు.ఇక ఈ సినిమాను మంచి బంధాలు నిర్మించుకోవాలనే కాన్సెప్ట్ ని చూపించాడు.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, సినిమా కథ, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్:
ఇక రొటీన్ స్టోరీ గా అనిపించింది.సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా మంచి ఎమోషనల్ సన్నివేశాలతో టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చింది కాబట్టి ఈ సినిమా చూడవచ్చు.