మనం వాట్సాప్ అకౌంట్ తెరవాలన్నా, టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా.ఫేసుబుక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా మన మొబైల్ ఫోన్ నెంబర్ కు వచ్చే వన్ టైం పాస్ వర్డ్ తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఆ ఖాతాలను వినియోగించేది ఎవరో తెలుసుకోవడానికి ఆయా సంస్థలు ఈ వన్ టైం పాస్ వర్డ్ పద్ధతిని పాటిస్తున్నాయి.అయితే వేరేవారి వన్ టైం పాస్ వర్డ్ తస్కరించి.
వారి మొబైల్ నెంబర్ తో వాట్సాప్ అకౌంట్ గాని ఇంకా ఇతర ఏ అకౌంట్ గాని క్రియేట్ చేయడం సాధ్యం కాదు.కానీ తెలివి మీరిన కొందరు హ్యాకర్లు వన్ టైం పాస్ వర్డ్ ని కూడా హ్యాక్ చేయగలుగుతున్నారు.
దీంతో ఒకరి మొబైల్ నెంబర్ తో మరొకరు ఎంచక్కా అప్లికేషన్లను వినియోగిస్తున్నారు.ఇలాంటి ఈ కొత్త సైబర్ మోసం తాజాగా తెరమీదకు వచ్చింది.
పూర్తి వివరాలు తెలుసుకుంటే.తిరుమలగిరి ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు బీఫార్మసీ చదువుతున్నాడు.ఇతడు తన కుటుంబంతో కలిసి ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు.అదే అపార్ట్ మెంట్ లో సమీప బంధువైన ఓ వివాహిత తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది.
అయితే ఆమె పై కన్నేసిన బీఫార్మసీ విద్యార్థి సోషల్ మీడియా ద్వారా ఆమెకు అశ్లీల, అసభ్యకర మెసేజ్లు పంపించాలనుకున్నాడు.అయితే తన నెంబర్ తో ఆమెకు మెసేజ్ చేస్తే దొరికిపోతానని భావించిన సదరు యువకుడు వేరొక నెంబర్ ద్వారా ఆమెకి మెసేజ్ పంపించాలి అనుకున్నాడు.ఇదే సమయంలో టెలిగ్రామ్ లో గరిష్టంగా రూ.100 కి ఓటిపి విక్రయించే గ్రూప్ ఒకటి కనిపించింది.దీంతో వారికి పేటియం ద్వారా కేవలం 20 రూపాయలు చెల్లించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మొబైల్ నెంబర్ యొక్క ఓటీపీ తెలుసుకొని వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయగలిగాడు.
![Telugu Cyber, Otp Password, Tirumalagiri, Latest, Whatsapp-Latest News - Telugu Telugu Cyber, Otp Password, Tirumalagiri, Latest, Whatsapp-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/02/Oh-my-God-they-can-also-selling-OTP.jpg )
అనంతరం తమ సమీప బంధువు నివేదించడం ప్రారంభించాడు.ఈ వేధింపులు తాళలేక ఆమె సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది.దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న ఎస్సై రమేష్ ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలో దర్యాప్తు చేసి నిందితుడు సమీప బంధువు అని గుర్తించారు.
దీనితో ఓటిపి విక్రయం గురించి వెలుగులోకి వచ్చింది.అయితే తాను ఎప్పటికీ దొరికిపోనని తాను అనుకున్నట్టు సదరు నిందితుడు చెబుతున్నాడు.కానీ పోలీసులు టెక్నాలజీ సహాయంతో తక్కువ సమయంలోనే అతడిని పట్టుకుని వావ్ అనిపించారు.అయితే సైబర్ నేరగాళ్లు ఓటిపి పాస్వర్డ్ ఎలా దొంగలిస్తున్నారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.