ఎందుకో అర్థం కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు వెంటనే హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.వాళ్ళు పెళ్లి చేసుకున్న, పెళ్లి చేసుకోకున్నా, సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఇలా ప్రతి విషయంలో జనాలు వారిపై బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
నిజానికి వాళ్ల వ్యక్తిగత విషయంలో వాళ్లకు ఏం జరిగినా లైట్ తీసుకుంటూ ఉంటారు సెలబ్రెటీలు.కానీ జనాలే వాటిని పట్టుకొని మరి పీడిస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు నిహారిక ( Niharika ) విషయంలో కూడా ఇదే నడుస్తుంది.
మెగా ప్రిన్సెస్, టాలీవుడ్ నటి నిహారిక పెళ్లి జరిగినప్పటి నుంచి బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.
పెళ్లికి ముందు మెగా ఫ్యామిలీ( Mega Family ) సపోర్ట్ తో ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టగా కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమైంది.మళ్లీ హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు కూడా రాలేవు.
అప్పుడప్పుడు తన తండ్రి తో పాటు తను కూడా బుల్లితెరపై సందడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉండేది.
పెళ్లికి ముందు కూడా ఆమె అతి పట్ల బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.ఇక జొన్నలగడ్డ చైతన్యను( Chaitanya Jonnalagadda ) పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత ప్రతి ఒక్క విషయంలో బాగా అతిగా ప్రవర్తించింది.
ఇక నటిగా తాను కొనసాగానని అనుకొని మెల్లగా తండ్రి సపోర్ట్ తో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.అలా పెద్ద పెద్ద సినిమాలు కాకుండా చిన్న చిన్న సినిమాలలో నిర్మాతగా చేసింది.

ఇక పెళ్లి తర్వాత ఆమె తన భర్తతో ఉండే విధానం, సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా లేకుండా పోయింది.ఈమె ఒక్కదానికే పెళ్లయిందా అన్నట్లుగా ప్రవర్తించింది.ఇక తన భర్తతో విదేశాలకు తిరుగుతూ ఒకింత బాగానే ఎంజాయ్ చేసింది.నిజానికి తన భర్త చైతన్య కూడా మంచి పర్సనే.తన మామ లాగానే తను కూడా తన భార్య నిహారికకు చాలా ఫ్రీడం ఇచ్చాడు.
ఇక ఆ ఫ్రీడమ్ అనేది నిహారిక కాపాడుకోలేకపోయింది.
ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంది.దానివల్లనే మెగా ఫ్యామిలీ పరువు కూడా తీసింది గతంలో.
ఒక పబ్ కేసులో ఇరికిన ఆమె బాగా విమర్శలు ఎదుర్కొంది.పెళ్లయినప్పటికీ కూడా ఇతర మగవాళ్ళతో క్లోజ్ గా ఉండటం కూడా అందరికీ నచ్చలేదు.
ఆ సమయంలో అటువంటి విమర్శలు ఎదుర్కోవటం వల్ల సోషల్ మీడియాను దూరం పెట్టేసింది.

ఇక మళ్లీ కొంతకాలానికే సోషల్ మీడియాలో యాక్టివ్గా మారి పోస్టులు షేర్ చేయడం ప్రారంభించింది.అంతేకాకుండా తన స్టైల్ మొత్తం మార్చేసింది.పొట్టి పొట్టి బట్టలు వేసేసి మెగా వారి పరువు తీసేసింది.
అయితే గత కొన్ని రోజుల నుండి ఈమె విడాకులు తీసుకుందని.భర్తకు దూరంగా ఉంటుంది అని.సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేసిందని తెలిసింది.
తన భర్త చైతన్య కూడా ఫోటోలను డిలీట్ చేసినట్లు తెలిసింది.
కానీ ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ ఎక్కడ బయట పెట్టలేదు.లోలోపలే అన్ని దాచేస్తున్నారు.
ఈ క్రమంలో నిహారిక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది.మళ్లీ యధావిధిగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ షో చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తను స్టోరీ పంచుకుంది.

ఇక ఆ స్టోరీ చూసి జనాలు నిహారిక విషయంలో మరింత అనుమానం పడుతున్నారు.అయితే అందులో ఏముందంటే.అందులో తను ఒక వ్యక్తితో క్లోజ్ గా ఫోటో దిగి అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.అంతేకాకుండా…చిన్న టోపీ, నువ్వు నా జీవితం లో ఎంతో ముఖ్యమైనవాడివి, నువ్వు నాతో ఎప్పుడు ఇలాగే ఉండాలి.లాట్స్ ఆఫ్ లవ్ అంటూ చెప్పుకొచ్చింది.
దీంతో ఆ స్టోరీ చూసి ప్రతి ఒక్కరు ఆమెపై బాగా అనుమానం పడుతున్నారు.నిహారిక కొత్త బాయ్ ఫ్రెండా అంటూ బాగా ఆరా తీస్తున్నారు.ఇక మరికొంతమంది.లాట్సాఫ్ లవ్ అనగానే కొత్త బాయ్ ఫ్రెండ్ అవుతాడా.
మరెవరైనా ఉండొచ్చు కదా.అలా అసలు విషయాలు తెలుసుకోకుండా ఎలా కామెంట్లు చేస్తారు అని నిహారిక అభిమానులు ఫైర్ అవుతున్నారు.