సోయచిక్కుడు( soya bean ) పంటను ఎక్కువగా సారవంతమైన నల్లరేగడి, బలమైన మద్యస్థ నేలలలో వర్షాధార పంటగా సాగు చేస్తారు.సోయా చిక్కుడు లో 30% ప్రోటీన్లు, 20% నూనె ఉంటుంది.
సోయా చిక్కుడు పంట పూత, కాయ దశలో ఉన్నప్పుడు తెగుళ్ల బెడద ( Pests )ఎక్కువగా ఉంటుంది.పంట వేశాక వాతావరణంలో మబ్బులతో కూడిన వర్షం, వాతావరణం లో మార్పులు జరిగినప్పుడు గాలి ద్వారా ఆకుమచ్చ తెగుళ్లు పంటను ఎక్కువగా ఆశించి తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తాయి.
సర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు:
సోయా చిక్కుడు లేత ఆకులపై ఎరుపు, ఊదా రంగు మచ్చలు ఏర్పడితే సర్కోస్పోరా ఆకు మచ్చ తెగులుగా నిర్ధారించుకోవాలి.ఈ తెగుళ్లు లేత ఆకుల అంచు నుండి లోపలికి వ్యాప్తి చెంది ముదురు రంగులోకి మారుతూ ఆకు పైభాగం అంతా వ్యాపిస్తాయి.వీటి నివారణ కోసం మ్యాంకోజెబ్ 2.5 గ్రా.ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
అంత్రక్నోస్ ఆకుమచ్చ తెగులు:
ఆకులపై వలయాకారపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి పసుపు వర్ణంలోకి మారి రాలిపోతే వాటికి అంత్రక్నోస్ ఆకుపచ్చ తెగులుగా నిర్ధారించుకోవాలి.ఈ మచ్చలు సోకితే కాయలపై గోధుమ రంగు వలయాకారపు మచ్చలు ఏర్పడి విత్తనం నాణ్యతను కోల్పోతుంది.వి ఈ తెగుళ్ళ నివారణకు కార్బండిజమ్ 1గ్రా.
ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మొవ్వ కుళ్ళు తెగులు:
వాతావరణంలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు తామర పురుగుల ద్వారా ఈ తెగులు లేత మొక్కలను ఆశించి గిడసబారి పోయేలా మొక్క యొక్క మొగ్గ ఎండిపోతుంది.ద్వారా పంట లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది.ఈ తెగుళ్ల నివారణకు మోనోక్రోటోపస్ 1.6 మీ.లీ ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.