ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఈడీ త్వరలోనే మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది.మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, అమన్ దీప్ ధల్ పై ఈడీ అధికారులు అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.
ఇప్పటికే ఒక ప్రధాన ఛార్జ్‌షీట్ తో పాటు రెండు అదనపు ఛార్జ్షీట్లను ఈడీ దాఖలు చేసిన విషయం తెలిసిందే.కాగా మూడో అదనపు ఛార్జ్‌షీట్ లో సిసోడియాతో పాటు పిళ్లై, అమన్ దీప్ లపై ఈడీ అభియోగాలు చేసింది.







