సిద్ధార్థ్ ( Siddharth ).ఈ హీరోకు టాలీవుడ్ ( Tollywood ) లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు.
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి.ఇప్పటికి ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి బుల్లితెరపై మంచి ఆదరణ ఉంటుంది.
మరి అలాంటి హీరో ఇప్పుడు కనుమరుగయ్యారు.గత కొన్నేళ్లుగా ఈయన హిట్ అనే మాట ఎరుగలేదు.ఏ సినిమాతో వచ్చిన అది ప్లాప్ అవుతూనే ఉంది.అందుకే సిద్ధార్థ్ మొత్తానికి కోలీవుడ్ కు వెళ్ళిపోయి అక్కడే వరుస సినిమాలు చేస్తున్నాడు.అక్కడ అడపాదడపా హిట్స్ అయితే అందుకుంటున్నాడు.ఇక్కడ అవకాశాలు వచ్చిన కూడా అవి ఈయనకు మళ్ళీ ఆ రేంజ్ స్టార్ డమ్ తేలేక పోయాయి.
ఇదిలా ఉండగా ఈ రోజు ఈయన పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.ఈ సందర్భంగా ఈయనకు ఫ్యాన్స్ నుండి, ప్రముఖుల నుండి విషెష్ అందుతున్నాయి.మరి తాజాగా ఈయన పాన్ ఇండియాలోనే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఇండియన్ 2‘ ( Indian 2 ) సినిమాలో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.
ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసారు.మరి ఇంతటి భారీ పాన్ ఇండియన్ సినిమాలో భాగం అయినందుకు ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది అయిన ఈయనకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కమల్ హాసన్ (kamal haasan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శంకర్ ( Shankar ) డైరెక్ట్ చేస్తుండగా.లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్న.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ), రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.