ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే మాట బాగా వినిపిస్తోంది.ముఖ్యంగా టీడీపీ నేతలే దీనిపై చర్చించుకుంటోన్న పరిస్థితి ఉంది.
గంటా అసలు మా పార్టీ ఎమ్మెల్యేయేనా ? ఆయన అసలు మా పార్టీలో ఉన్నారా ? లేదా ఏ పార్టీలో ఉన్నారు ? అని సెటైర్లు వేసుకుంటున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబును గంటా ఏ మాత్రం లెక్కచేయని పరిస్థితి.
చంద్రబాబు సైతం గంటా విషయంలో చూసి చూసి విసిగిపోయారు.పార్టీ ఓడిపోయాక గంటా ఏ మాత్రం బయటకు రాలేదు.
ఉత్తరాంధ్రలో పలువురు సీనియర్లు బయటకు వచ్చి పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్నా గంటా మాత్రం వైసీపీపై నోరు పెగల్చడం లేదు.
ఆయన పార్టీ మారిపోతారన్న ప్రచారం జోరుగా నడుస్తోన్న వేళ.ఇటీవలే బయటకు వచ్చి తన ఉత్తర నియోజకవర్గ పార్టీ సమావేశం మాత్రం నిర్వహించారు.ఇక పార్టీలో అగ్ర నేతలకు ఆయన ఏ మాత్రం టచ్‌లోకి రావడం లేదు.
చంద్రబాబు ఎన్నో సార్లు పార్టీ నేతల సమావేశాలతో పాటు ఎమ్మెల్యేల సమావేశాలు పెడుతున్నా గంటా చాలా లైట్ తీస్కొంటున్నారు.ఇక ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోన్న వేళ ఆయన వైసీపీ ఎంట్రీని ఆ పార్టీలో సీనియర్ నేతలే అడ్డుకుంటున్నారని ప్రచారం జరిగింది.

ఇక ఆయన బీజేపీలోకి వెళతారన్న ప్రచారం కూడా జరిగింది.దీనికి తోడు టీడీపీ సమావేశాల్లోనూ పాల్గోనక పోవడంతో గంటా పార్టీ మార్పు ఖాయమే అనుకున్నారు.తాను పార్టీ మారితే ఓపెన్‌గానే చెపుతానని చెప్పిన గంటా.తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు ఎన్టీఆర్ తనకు ఆరాధ్యుడు అని చెప్పారు.
ఆ మాట చెప్పినా.ఆయన మాత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాత్రం పాల్గొనలేదు.
ఇక పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలోనూ పాల్గొనలేదు.దీంతో గంటా ఏ పార్టీలో ఉన్నారు? అన్న విషయం చర్చనీయాంశం అయ్యింది మరి గంటా పొలిటికల్ రూటు ఎలా ? ఉంటుందో ? చూడాలి.