అధికారంలో ఉన్న నాయకుల ఫోటోలను ప్రతి చోట ఫ్లైక్సీలుగా మార్చి పెట్టడం మన నేతలకు అలవాటే.కానీ కొన్ని సందర్భాల్లో అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫ్రీ పబ్లిసిటికి సంబంధించి ఫోటోలను పెడతామంటే ప్రతిపక్షాలు ఊరుకోవు.
ఎక్కడ వారికి ఉన్న సానుభూతి తగ్గిపోతుందో అనే అనుమానం.
ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సందర్భంగా, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చే సర్టిఫికెట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటో కనపడుతోందని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీతో పాటు పలువురు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అదీగాక ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటోను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారట.

కాగా ఈ అంశం పై స్పందించిన ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మోదీ ఫోటోను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా వెంటనే ఆదేశాలను అమలు చేయాలని పేర్కొంది.