నంద్యాల ఎంపీ ఎస్ పి వై రెడ్డి (69) మంగళవారం రాత్రి 9:30 ప్రాంతంలో మరణించారు.ఈయన గతకొంతకాలంగా కిడ్నీ,హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ నెల 3 వ తారీఖు నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉన్న అయన మంగళవారం రాత్రి మరణించారు.
ఆయనకు భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఎస్ పి వై రెడ్డి 1984 నుంచి నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల నిర్మాణం బిజినెస్ చేస్తున్నారు.గతంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్ గాను పనిచేసారు.ప్రస్తుతం నంద్యాల సిట్టింగ్ ఎంపీ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఏప్రిల్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికలలో నంద్యాల నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసారు.
.
ఎస్ పి వై రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కడపజిల్లా అంకాలమ్మగూడూరు గ్రామంలో జూన్ 4, 1950 న జన్మించాడు.ఎస్ పి వై రెడ్డి గారు NIT వరంగల్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ పట్టా పొందారు మరియు ముంబై ఆధారిత భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (భారతదేశం యొక్క ప్రీమియం న్యూక్లియర్ ఫెసిలిటి)లో చేరారు.
ఎస్ పి వై రెడ్డి గారి మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు.