కేసీఆర్ అవునంటే కేటీఆర్ కాదంటున్నారా  ?

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల అంశానికి సంబంధించి చర్చ ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లుగానే వ్యవహరించారు.2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించినా, 2019 వరకు ప్రభుత్వానికి సమయం ఉన్నా, 2018 లోనే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారు.  అనుకున్న మేరకు సక్సెస్ అయ్యారు.

 Kcr And Ktr About The Early Elections, Kcr , Ktr  , Ts Poltics, Early Elections,-TeluguStop.com

రెండోసారి టిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు 2023 వరకు సమయం ఉన్నా , ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లుగానే ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్ ఈ మధ్యకాలంలో దూకుడు పెంచారు.

  ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో  ప్రధాని నరేంద్ర మోదీ ,కేంద్ర మంత్రులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉండడం, ఇవన్నీ ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నాయి.

అనేక సందర్భాల్లో ను కేసీఆర్ పరోక్షంగా ముందస్తు ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు.  అయితే కేసిఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ కు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టం లేదట.

ప్రభుత్వానికి ఇంకా ఏడాది సమయం ఉండగా,  ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనవసరమని,  ఒకవేళ ఎన్నికల ఫలితాలు తేడా కొడితే ఏడాది పాటు, పదవులు, పరువు  పోవడంతో పాటు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలనే అభిప్రాయంలో కేటీఆర్ ఉన్నారట.
   

  అయితే కేసీఆర్ మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో బిజెపి ని దెబ్బకొట్టి మరింత గా టిఆర్ఎస్ ను బలోపేతం చేయాలని కెసిఆర్ చూస్తుండగా కేటీఆర్ మాత్రం కేసిఆర్ ఈ ప్రతిపాదనను అంగీకరించడం లేదట.అందుకే ముందస్తు ఎన్నికల విషయమై సందిగ్ధత నెలకొందట.

పైకి ముందస్తు ఎన్నికలు లేవు అంటూనే దానికి సంబందించిన కసరత్తు కేసీఆర్ చేస్తుండడం అనేక సందేహాలకు కారణం అవుతోంది.

Minister KTR Not Interested for Early Elections in Telangana

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube