ప్రతుతం తెలంగాణలో కరోనా లాక్ డౌన్ నుంచి ఉపశమనం లభించింది.థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.
అయితే నిర్మాతలు ఎవరూ కూడా ధైర్యం చేసి సినిమా రిలీజ్ చేయడానికి ముందుకి రావడం లేదు.థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేసిన ప్రేక్షకులు ఒకప్పటిలా వస్తారా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి.
ఈ నేపధ్యంలోనే ముందుగా ఒక పెద్ద సినిమా రిలీజ్ చేస్తే దానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన బట్టి చిన్న సినిమాలు అన్ని క్యూ కట్టే అవకాశం ఉంది.అయితే పెద్ద సినిమాలు ఇప్పట్లో రిలీజ్ కి రెడీగా ఉన్నవి లేవు.
అన్ని మినిమమ్ బడ్జెట్ సినిమాలే ఉన్నాయి.నాను టక్ జగదీష్ మాత్రమే కొద్దో గొప్పో పెద్ద సినిమా.
అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఆగష్టు వరకు నిర్మాతలు వేచి చూడాలని అనుకుంటున్నారు.ఇదిలా వెంకటేష్ నారప్ప మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

తమిళ్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియమణి వెంకటేష్ కి జోడీగా నటించింది.ఇక వెనక్తేష్ వయస్సు మళ్ళిన పాత్రలో ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నాడు.కుల వ్యవస్థ నేపధ్యంలో అగ్రకులం, నిమ్నకులం మధ్య ఆధిపత్య పోరుగా ఈ మూవీ కథాంశం ఉండబోతుంది.ఇదిలా ఉంటే నారప్పని థియేటర్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాత సురేష్ బాబు మొదటి నుంచి భావిస్తున్నారు.
కాని ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.దీనికి కారణం డిస్నీ హాట్ స్టార్ నుంచి వచ్చిన భారీ డీల్ అని తెలుస్తుంది.నారప్ప మూవీకి డిస్నీ హాట్ స్టార్ ఏకంగా 70 కోట్లు ఆఫర్ చేయడంతో సురేష్ బాబు ఆలోచించుకొని ఒటీటీ రిలీజ్ కి ఒకే చెప్పెసినట్లు టాక్.ఈ నేపధ్యంలో ఇప్పటికే డీల్ క్లోజ్ చేసుకొని నారప్ప ఒటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ కోసం హాట్ స్టార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.