పవన్ కళ్యాణ్ కు సరికొత్త పేరు పెట్టిన బండ్ల గణేష్!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారేవ్వరు లేరు.ఓవైపు రాజకీయాలను, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ బాధ్యత వహిస్తున్నాడు.

 Bandla Ganesh Gives New Name To Pawan Kalyan, Bandla Ganesh, Pawan Kalyan, Tolly-TeluguStop.com

ఇక ఈయనకు అటు సినిమా పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కు కొందరి నుండి విమర్శలు కూడా ఎదురవుతాయి.ఇప్పటికే సినీ నటి శ్రీరెడ్డి, కత్తి మహేష్ లు పవన్ వ్యక్తిగత విషయంను బయటికి లాగుతుంటారు.

ఇదంతా ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్న భక్తుడు, అభిమానుడు ఎవరు అనగానే.టక్కున గుర్తొచ్చే పేరు బండ్ల గణేష్.ఈయన పవన్ పై చూపించే అభిమానం ఓ లెవెల్ లో ఉంటుంది.లైవ్ లోనే పవనిజం గురించి పొగుడుతూ ఉంటాడు.

ఇక ఆయన పవన్ గురించి వేసే కొత్త కొత్త డైలాగులు వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.నిజానికి బండ్ల గణేష్ పవన్ పై చూపించే అభిమానాన్ని చాలావరకు భజన అనే అంటుంటారు.

ఈయన మాటలను ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.ఇక ఆయన నోటి నుండి వచ్చే డైలాగ్స్ మాత్రం ఎంతలా వైరల్ అవుతాయో చూస్తూనే ఉంటాం.

పవన్ గురించి స్పీచ్ ఇచ్చినప్పుడు చూస్తే మాత్రం పవన్ స్పీచ్ కూడా అంతలా వైరల్ అవుతుందో లేదో కానీ బండ్ల గణేష్ స్పీచ్ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

Telugu Bandla Ganesh, Pawan Kalyan, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు మరో పేరు పెట్టాడు.తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేయగా ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ గా మారింది.అందులో పవన్ తో కలిసి దిగిన ఫోటో ఉండటంతో పాటు.

నా దేవర తో నేను అంటూ.భక్త కన్నప్ప పరమేశ్వరుడిని దేవర అని పిలుచుకునేవారని తను కూడా ఈరోజు నుంచి తన బాస్ ని దేవర అని పిలుస్తాను అని ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం పవన్ కి పెట్టిన కొత్త పేరును పవన్ అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube