హాలీవుడ్ లో విమెన్ యాక్షన్ సిరీస్ లో కిల్ బిల్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది.కిల్ బిల్ సిరీస్ లో భాగంగా వచ్చిన అన్ని సినిమాలకి మంచి ఆదరణ లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా కిల్ బిల్ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలని ఇండియన్ దర్శక, నిర్మాతలు నేరుగా హిందీ బాషలో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రెంచ్, కొరియన్, మూవీస్, హాలీవుడ్ మూవీ హక్కులు కొనుగోలు చేసి హిందీలో రీమేక్ చేస్తున్నారు.అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీ అలా హాలీవుడ్ నుంచి తీసుకున్న సబ్జెక్ట్ తోనే తెరకేక్కుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కిల్ బిల్ సిరీస్ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ మూవీలో మెయిన్ లీడ్ కోసం టాలెంటెడ్ బ్యూటీ కృతి సనన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా కృతి సనన్ ఉంది.వరుసగా పెద్ద పెద్ద సినిమాలని చేతిలో పెట్టుకుంది.
ఇప్పటికే ప్రభాస్ కి జోడీగా ఆది పురుష్ లాంటి సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది.మరో వైపు ఈమె నటించిన మూడు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్నాయి.
ఇంకో సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఫిమేల్ యాక్షన్ మూవీలో కృతి సనన్ కి అవకాశం వచ్చిందని బి టౌన్ లో వినిపిస్తుంది.
ఇక ఈ మూవీ కోసం కృతి సనన్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్స్ంక లో శిక్షణ తీసుకోవడానికి రెడీ అవుతుందని బిటౌన్ లో వినిపిస్తుంది.అనురాగ్ కశ్యప్ ఈ మూవీని రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఉమతుర్మన్ నటించిన పాత్రలో హిందీలో కృతి సనన్ కనిపించబోతుంది.