ప్రకాశం జిల్లాలోని ఓ పురాతన శివాలయంలో నంది విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.నాగులుప్పలపాడు మండలం కనపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే ఈ ఘటన గుప్త నిధుల కోసమా.? కుట్ర కోణమా.? అనే అనుమానులు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.నంది విగ్రహాన్ని పగులగొట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిందితులిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.