ఏపీ ప్రత్యేకతలను షోకేస్ చేయడానికి దావోస్ సదస్సు ఉపయోగపడుతుంది 18 అంశాలు 10 అంశాలు ప్రాధాన్యతగా ఏపీ చర్చించే అవకాశం ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్
త్వరలో జరగబోయే దావోస్ సదస్సు ద్వారా ఏపీకి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.ఈ మేరకు ఈనెల 22వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి తో కలిసి సదస్సులో ఏపీకి చెందిన ప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
ఈ మేరకు విశాఖలో ఐటీ మంత్రి మీడియాతో మాట్లాడారు.దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
దావోస్ సదస్సు జరిగే ప్రాంతంలో ఏపీ తరఫున పెవిలియం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.చంద్రబాబునాయుడు హయాంలో ఇలాంటి సదస్సులను బ్లాక్ మనీని వైట్ చేసుకోడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతలు వివరించడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉండే సదస్సుగా ఆయన అభివర్ణించారు.